ఉపాధి హామీ పనులు కూలీని కోటీశ్వరుడుని చేసాయి.  

ఉపాధి హామీ పనులలో బయట పడ్డ మైకా నిక్షేపాలు. .

White Mica Mines In Former Land In Telangana-former Land,telangana,white Mica Mines

అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఊహించి విధంగా ఉంటాయి. కూలి బ్రతుకులతో కాలం గడిపే వారిని కొన్ని సంఘటనలు కోటీశ్వరుడుని చేస్తాయి. చిన్న వ్యవసాయం భూమిలో సాగుచేసుకునే రైతన్నకి అదే భూమి ఒక్కోసారి కాసులు కురిపిస్తుంది అని తెలియకపోవచ్చు..

ఉపాధి హామీ పనులు కూలీని కోటీశ్వరుడుని చేసాయి. -White Mica Mines In Former Land In Telangana

ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి బద్రాద్రి జిల్లాలో జరిగింది. ఉపాధి హామీ పనులు ఓ రైతుని కోటీశ్వరుడుని చేసాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామంలో మాస్కో వైట్‌ మైకా ఖనిజం బయటపడింది.

బుధవారం ఓ రైతు పొలంలో స్థానికులు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. అక్కడ కూలీల మట్టి తవ్వుతూ ఉండగా సిల్వర్‌ కలర్‌తో అట్టలుగా కొన్ని రాళ్లు బయల్పడ్డాయి. అవి ఎండకు మెరిసిపోతూ ఉండటంతో కూలీలు అనుమానం వచ్చి అధికారులకి చెప్పడం జరిగింది.

అధికారులు వాటిని జియాలజీ సైంటిస్ట్ ల దగ్గరకి పంపించారు. వ్వకాల్లో బయటపడ్డ రాళ్లు ‘మాస్కో వైట్‌ మైకా’గా కాకతీయ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జియాలజీ ఇప్పుడు గుర్తించారు. కోట్ల విలువ చేసే ఈ వైట్ మైకా నిక్షేపాలు ఆ భూమిలో ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసారు.

ఆ భూమి ఉన్న రైతు పంట పండినట్లయ్యింది.