ఉపాధి హామీ పనులు కూలీని కోటీశ్వరుడుని చేసాయి.

అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఊహించి విధంగా ఉంటాయి.కూలి బ్రతుకులతో కాలం గడిపే వారిని కొన్ని సంఘటనలు కోటీశ్వరుడుని చేస్తాయి.

 White Mica Mines In Former Land In Telangana-TeluguStop.com

చిన్న వ్యవసాయం భూమిలో సాగుచేసుకునే రైతన్నకి అదే భూమి ఒక్కోసారి కాసులు కురిపిస్తుంది అని తెలియకపోవచ్చు.ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి బద్రాద్రి జిల్లాలో జరిగింది.

ఉపాధి హామీ పనులు ఓ రైతుని కోటీశ్వరుడుని చేసాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామంలో మాస్కో వైట్‌ మైకా ఖనిజం బయటపడింది.

బుధవారం ఓ రైతు పొలంలో స్థానికులు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు.అక్కడ కూలీల మట్టి తవ్వుతూ ఉండగా సిల్వర్‌ కలర్‌తో అట్టలుగా కొన్ని రాళ్లు బయల్పడ్డాయి.

అవి ఎండకు మెరిసిపోతూ ఉండటంతో కూలీలు అనుమానం వచ్చి అధికారులకి చెప్పడం జరిగింది.అధికారులు వాటిని జియాలజీ సైంటిస్ట్ ల దగ్గరకి పంపించారు.వ్వకాల్లో బయటపడ్డ రాళ్లు ‘మాస్కో వైట్‌ మైకా’గా కాకతీయ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జియాలజీ ఇప్పుడు గుర్తించారు.కోట్ల విలువ చేసే ఈ వైట్ మైకా నిక్షేపాలు ఆ భూమిలో ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసారు.

ఆ భూమి ఉన్న రైతు పంట పండినట్లయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube