అమెరికా: పడుతూ.. లేస్తూ ప్రయాణం, ఎట్టకేలకు 50 శాతం మందికి వ్యాక్సినేషన్

కరోనాతో తీవ్రంగా నష్టపోయిన అమెరికా .తన పౌరులను కాపాడుకునేందుకు గాను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 White House Says 50 Percent Of Americans Fully Vaccinated Against Covid , Vaccin-TeluguStop.com

ఈ క్రమంలో అగ్రరాజ్యం అరుదైన మైలురాయిని అందుకుంది.శుక్రవారం నాటికి దేశంలో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయంలో వ్యాక్సినేషన్‌ సమాచార విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సైరస్‌ షాపర్‌ వెల్లడించారు.

అమెరికాలో ఇప్పటి వరకు 165 మిలియన్ల మందికి రెండు డోసుల మోడెర్నా లేదా ఫైజర్‌ టీకాగానీ లేదా సింగిల్ డోసు జాన్సన్‌ టీకా గానీ అందింది.

అమెరికా మొత్తం జనాభాలో సగం మందికి అంటే.టీకా అందుబాటులోకి రాని 0-11 ఏళ్ల పిల్లలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.ఒకవేళ టీకా తీసుకోవడానికి అర్హత గల వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే 58.5 శాతం మందికి వ్యాక్సిన్‌ అందినట్లు సీడీసీ గణాంకాలు చెబుతున్నాయి.58.4 శాతం అంటే 193 మిలియన్ల మంది జనాభాకి కనీసం ఒక డోసు టీకా అందింది.

గతేడాది డిసెంబర్ 14 నుంచి అమెరికాలో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.ఫైజర్ సంస్థ అభివృద్ది చేసిన టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించింది.దీనిలో భాగంగా తొలి టీకాను ఓ నర్సుకు అందజేశారు అధికారులు.క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్‌ యూదు మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్‌లో నర్సుగా పనిచేస్తున్న సాండ్రా లిండ్స్‌ అమెరికాలో తొలి కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర పుటల్లోకెక్కారు.

వ్యాక్సిన్ తీసుకునేందుకు కోట్లాది మంది అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ .టీకా తీసుకున్న పలువురిలో అలర్జీ లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.

Telugu Joe Biden, Johnson Vaccine, Moderna, Pfizerbio, Pfizer Vaccine, Sandra Li

ఈ పరిణామాల నేపథ్యంలో అనాఫిలాక్సిన్‌ లక్షణాలు ఉన్న వారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.పలు నిర్దిష్ట ఔషధాలు, ఆహార పదార్ధాలు తదితరాల వల్ల అలెర్జీ తలెత్తే ఆరోగ్య పరిస్థితిని అనాఫిలాక్సిస్‌ అంటారు.ఈ సమస్య ఉన్నవారు ఫైజర్‌-బయో ఎంటెక్‌ వ్యాక్సిన్‌ తీసుకోవద్దని బ్రిటిష్ మెడికల్‌ రెగ్యులరేటర్‌ సూచించింది.అయితే యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మాత్రం అలెర్జీ లక్షణాలు ఉన్న వారు ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నా సురక్షితంగా ఉన్నారని తెలిపింది.

వ్యాక్సిన్లు, దానిలోని సమ్మేళనాల పట్ల ఎలర్జీ ఉన్నవారు మాత్రమే ఫైజర్‌ టీకాను వినియోగించవద్దని డ్రగ్ ఏజెన్సీ సూచించింది.

ఇక అధికారంలోకి వస్తూనే కరోనా అంతమే తన మొదటి లక్ష్యయమన్నారు జో బైడెన్.

అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.

మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.దీంతో బైడెన్‌ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.

దాన్ని కూడా 10 రోజుల ముందే.అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, జూలై 4 నాటికి దేశాన్ని కరోనా ఫ్రీగా చేయాలని బైడెన్ కంకణం కట్టుకున్నారు.ఈ క్రమంలో ఆయన విజయం సాధించారు కూడా.

వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగుతున్న వేళ.సోషల్ మీడియాలో తప్పుడు కథనాలకు తోడు, అపోహలు, అనుమానాలతో కొందరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడ్డారు.దీంతో టీకా కార్యక్రమం నెమ్మదించిన సంగతి తెలిసిందే.

Telugu Joe Biden, Johnson Vaccine, Moderna, Pfizerbio, Pfizer Vaccine, Sandra Li

మరోవైపు, డెల్టా వేరియంట్‌ విజృంభిస్తుండడంతో అమెరికాలోని కొన్ని ప్రాంతాలు ఆంక్షల బాట పడుతున్నాయి.న్యూయార్క్‌, లాస్‌ఏంజిల్స్‌ సహా కొన్ని కీలక ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు.తొలి విడతలో కల్లోలం చూసిన అగ్రరాజ్యంలో గత 3 రోజులుగా లక్షకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆసుపత్రులకు తాకిడి పెరిగింది.ఈ పరిస్ధితుల నేపథ్యంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube