ముఖానికి మాస్క్‌ల్లేవు.. షేక్‌హ్యాండ్‌లు, ఆలింగనాలు: మునుపటి వాతావరణం దిశగా అగ్రరాజ్యం

కరోనా కారణంగా ఈ భూమ్మీద అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశం అగ్రరాజ్యం అమెరికాయే.ఆర్ధిక, సామాజిక, సాంకేతిక, సైనిక, వైద్య పరంగా అత్యంత శక్తివంతమైన పెద్దన్నను కంటికి కనిపించని ఓ చిన్న సూక్ష్మజీవి ముప్పుతిప్పలు పెట్టింది.

 White House Retreats To Normalcy: Biden Takes Off Masks Officials Hug Around, Jo-TeluguStop.com

వైరస్ వెలుగు చూసిన కొత్తల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉదాసిన వైఖరి కారణంగా అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు.లక్షలాది కేసులు, మరణాలతో అమెరికా వణికిపోయింది.

ఒకానొక దశలో అమెరికాలో కనీసం సగం మందైనా మిగులుతారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.కానీ ఆలస్యంగానైనా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది.

ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.కరోనాను అదుపు చేయడమే తన తొలి కర్తవ్యమని ప్రకటించి ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.

ముఖ్యంగా వ్యాక్సినేషన్‌కు బైడెన్ అధిక ప్రాధాన్యమిచ్చారు.అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయడంతో.మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.

దీంతో బైడెన్‌ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.దాన్ని కూడా 10 రోజుల ముందే.

అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.దీనితో నెమ్మదిగా ఆంక్షల చట్రం నుంచి అగ్రరాజ్యం బయటపడుతోంది.ఇకపై రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గత శుక్రవారం స్పష్టం చేసింది.

దీనిపై అనుమానాలు, గందరగోళం వున్నా అమెరికన్లు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారన్నది మాత్రం నిజం.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో పండగ వాతావరణం కనిపిస్తోంది.

అధికారులు, సిబ్బంది మాస్క్‌లు లేకుండా తిరుగుతూ, గతంలో మాదిరి ఒకొరినొకరు ఆలింగనాలు చేసుకుంటున్నారు.అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో షేక్ హ్యాండ్‌ ఇచ్చేందుకు ప్రముఖులు ఎగబడుతున్నారు.

సందర్శకులు, అధికారులు ఆరు గజాల దూరం పాటించే అవసరం లేకుండా పోయింది.ఈ నేపథ్యంలో పరిస్ధితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు.

మరోవైపు శ్వేతసౌధంలోని అతిపెద్ద గది అయిన ఈస్ట్‌ రూమ్‌ను అధికారులు రెండో రోజు కూడా తెరిచారు.అమెరికా కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ హోదాలో తొలిసారి జో బైడెన్‌ ‘మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’ ప్రదానం చేశారు.70 ఏళ్ల క్రితం కొరియా యుద్ధంలో చూపిన ధైర్యసాహసాలకు గుర్తుగా 94 ఏళ్ల రిటైర్డ్‌ కర్నల్‌ రాల్ఫ్‌ పకెట్‌ జూనియర్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube