ట్రంప్ కు వైట్ హౌస్ ఘాటు రిప్లయ్..!!

బిడెన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తీసుకున్న కీలక నిర్ణయాలలో కరోనా నిర్మూలన , అలాగే వలస వాసులు, ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ విధించిన నిభందనలు ఎత్తి వేయడం.ఈ రెండు విషయాలపై బిడెన్ తన స్పష్టమైన వైఖరిని ప్రకటించారు, ఆచరణలో పెట్టారు.

 White House Replies To Trump, Trump, Whitehouse, America, Jen Saki, Biden-TeluguStop.com

అయితే బిడెన్ ప్రవేశ పెట్టిన ఇమ్మిగ్రేషన్ విధానాలపై తీవ్ర అసంతృప్తి ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వానికి లేఖను రాశారు.బిడెన్ విధానాలు, నిర్ణయాల కారణంగా సరిహద్దుల్లో వలసలు పెరిగిపోయాయని, ఇది అతిపెద్ద సంక్షోభానికి దారి తీసేలా ఉందని ఇది అమెరికా వాసులకు అంత మంచిది కాదని వెంటనే ఆంక్షలు విధించాలని లేఖలో తెలిపారు.

ట్రంప్ రాసిన లేఖపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఘాటుగానే స్పందించారు.ఇమ్మిగ్రేషన్ పాలసీపై ట్రంప్ పాటిస్తున్న వైఖరిని తాము అనుసరించబోమని స్పష్టం చేశారు.ట్రంప్ అపట్లో తీసుకున్న నిర్ణయాలు ఎంతో అవమానకరమైనవిగా ఉన్నాయని, ఉపయోగం లేని విధానాలు ట్రంప్ అనుసరించారని వాటిని మేము పాటించమని తేల్చి చెప్పారు.ట్రంప్ లేఖపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు జెన్ సాకీ.

ఇమ్మిగ్రేషన్ విధానాలపై బిడెన్ తీసుకున్న నిర్ణయాలు అందరికి ఆమోదగ్యోగంగా ఉన్నాయని ట్రంప్ కు నచ్చక పొతే మేము చేసేది ఏది లేదని అన్నారు.బిడెన్ విధానాలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు.

మేము తమ నిపుణుల అభిప్రాయాల ద్వారా ముందుకు వెళ్తామని , తమ మార్గం తమదేనని పేర్కొన్నారు జెన్ సాకీ.వలస దారుల పిల్లలు అమెరికా పౌరుల పిల్లలతో సమానమని వారిపట్ల బిడెన్ ప్రభుత్వం ప్రేమగా, మానవత్వంతో వ్యవహరిస్తుందని తెలిపారు.

వలస దారుల పిల్లలు సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించినపుడు వారి బాగోగులు చూసుకుంటామని, వారికి అన్ని ఆరోగ్య ఏర్పాట్లు చేపడుతామని ఇది మానవత్వంతో ఉన్న ప్రభుత్వమని ట్రంప్ లేఖపై ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు జెన్ సాకీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube