వైట్ హౌస్ మీడియా కార్యదర్శి పని, అందరి ముందు ట్రంప్ గారి బ్యాంక్ డిటైల్స్!

చిన్న పొరపాటు చేస్తేనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని టార్గెట్ చేస్తూ విమర్శకులు విమర్శలు చేస్తూ ఉంటారు.అలాంటిది వైట్ ‌హౌస్‌ మీడియా కార్యదర్శి పొరపాటు చేస్తే విమర్శకులు ఊరికే వదులుతారా ఏంటి.

 White House Press Secretary Kayleigh Reveals Trump Bank Details Mistakenly , Kay-TeluguStop.com

సరిగ్గా అదే జరిగింది.ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్(HHS) కు తన మూడు నెలల జీతం ను విరాళంగా ప్రకటించారు.

అయితే దీనికి సంబంధించి వివరాలను వెల్లడిస్తూ ఒక ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేశారు.అయితే ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కైలీ మేక్ ఎనాని పాల్గొని వివరాలను వెల్లడిస్తూ ఆమె ఒక చెక్ ను మీడియా ముందు చూపించారు.

ఇక అంతే అసలు ఆ చెక్ ఏంటి దాని వివరాలపై పడ్డారు.తీరా ఆ చెక్ ను పరీక్షగా చూసిన తరువాత అసలు విషయం అర్ధమయ్యింది.

ఆమె చేసిన పొరపాటు ఏంటంటే ట్రంప్ గారి మూడు నెలల వేతనానికి సంబందించిన చెక్ చూపించకుండా లక్ష అమెరికన్ డాలర్ల నగదు రాసి ఉన్న మరో చెక్ ను చూపించారు.అయితే దీనిలో ఏముందిలే అని అనుకుంటే పొరపాటే.

ఆ చెక్ లో ట్రంప్ గారి పేరు,సంతకం తో పాటు ఆయన గారి చిరునామా ఇంకా బ్యాంకు డిటైల్స్ అన్ని కూడా ఉండడం తో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఇలా మీడియా ముందు అధ్యక్షుడి బ్యాంకు వివరాలు అన్ని కూడా బయటపడడం అనేది అంత మంచిది కాదు అంటూ విమర్శకులు మండిపడుతున్నారు.

భాద్యత గల పోస్ట్ లో ఉండి ఇలాంటి పొరపాటు ఎలా చేస్తారు అంటూ కైలీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.అదేదో సామెత అన్నట్లు అసలు విషయం బదులు తోకను పట్టుకొని వేలాడుతున్నారు.

కైలీ చేసిన పొరపాటు తో ట్రంప్ గారి సాయం ను గురించి మాట్లాడుకోవడం మానేసి కైలీ చేసిన పొరపాటును పెద్ద హాట్ టాపిక్ గా మార్చేశారు.ఆమె గారు చేసిన చిన్న పొరపాటు తో ట్రంప్ చేసిన సాయం మాత్రం బయటపడడం లేదు.

Telugu Donlad Trump, Kayleigh, White, Whitepress-Telugu Political News

అయితే వైట్ హౌస్ అధికారులు మాత్రం కైలీ చేసింది చిన్నపొరపాటు మాత్రమేనని, దానికి ఇంత చర్చ అవసరం లేదంటున్నారు.అసలుకే ప్రచారం పై ఎక్కువగా మక్కువ చూపే ట్రంప్ గారు తన మూడు నెలల వేతనాన్ని HHS కు విరాళంగా అందించి ఆయన గురించి మాట్లాడుకోవాలని భావిస్తే కైలీ చేసిన పొరపాటు తో ఆయన గారి సాయం మరుగున పడిపోయేట్లు ఉంది.మరి కైలీ చేసిన పొరపాటు ను అధ్యక్షుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube