ఎన్నారైల ఆందోళన..దిగొచ్చిన వైట్ హౌస్..!!!

అమెరికాలో గాంధీ విగ్రహాల ధ్వంస ఘటన భారతీయులు అందరిని కలిచి వేసింది.ఈ ఘటనపై భారత్ ఘాటుగానే స్పందించింది.

 White House Press Secretary Jen Psaki Gandhi Statue Desecration-TeluguStop.com

వరుసగా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే చర్యలు తీసుకోవడం లేదంటూ దోషులను ఖటినంగా శిక్షించాలని కోరింది.ఈ ఘటనపై భారత్ లో నిరసనలు వ్యక్తమవ్వగా, అమెరికాలో భారతీయ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.

వరుస దాడులు జరుగుతున్నా దోషులను పట్టుకోవడం లేదంటూ నినాదాలు చేశారు భారతీయులు ఈ దాడి ఘటననను పలువురు సెనేటర్లు కూడా ఖండించారు.కాగా

 White House Press Secretary Jen Psaki Gandhi Statue Desecration-ఎన్నారైల ఆందోళన..దిగొచ్చిన వైట్ హౌస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్నారైల నిరసనలతో, భారత్ నుంచీ వచ్చిన విజ్ఞప్తి , ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు దిగొచ్చిన వైట్ హౌస్ గాంధీ విగ్రహాల ధ్వంసం పై విచారం వ్యక్తం చేసింది.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి స్పందించారు.కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.గాంధీ విగ్రహాలపై దాడులు చేస్తున్న తీరు మమ్మల్ని ఎంతో బాధించిందని, ఈ ఘటనపై తాము ఆందోళన చెందుతున్నామని ప్రకటించారు.

ఈ ఘటనపై ఇప్పటికే తాము దృష్టి పెట్టామని, నిందితులు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుని శిక్షిస్తామని ప్రకటించారు.గాంధీ ఎంతో ఆదర్శప్రాయుడని అమెరికా సమాజం ఆయన్ను గౌరవిస్తుందని, ఈ ఘటన ఎలా జరిగిందో తెలియడం లేదని, పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు.ఇదిలాఉంటే వైట్ హౌస్ ప్రకటనపై పలు భారతీయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

నల్లజాతీయుల ఉద్యమం సమయంలో కూడా గాంధీ విగ్రహాలపై దాడులు జరిగాయని, ఆ సమయంలో దోషులను శిక్షించి ఉంటే మళ్ళీ ఈ దాడులు జరిగి ఉండేవి కావని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

#BidenPress #GandhiStatue #California #WhiteHouse

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు