వైట్ హెడ్స్ రావటానికి కారణాలు     2017-09-20   00:03:15  IST  Lakshmi P

-

-

వైట్ హెడ్స్ ని ఇంటి నివారణలు మరియు సహజ నివారిణులతో నయం చేసుకోవటానికి ముందు అవి ఎలా వస్తాయో తెలుసుకోవాలి. సిబం గ్రీవములో ఇరుక్కుపోయినప్పుడు వస్తాయని తెలుసు. అయితే చర్మ రంద్రాలకు అడ్డంకులు ఎందుకు ఏర్పడతాయో కారణాలు తెలుసుకుందాం.

1. హార్మోన్ల మార్పులు
యుక్తవయస్సు, ఋతుస్రావం, గర్భం మరియు మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వైట్ హెడ్స్ ఏర్పడతాయి. హార్మోన్ల మార్పులు జరిగే సమయంలో సిబం ఎక్కువగా స్రవించటం వలన వైట్ హెడ్స్ ఏర్పడతాయి. ఇవి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా వస్తాయి.

2. కొన్ని మందులు
హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేసే కుటుంబ నియంత్రణ మాత్రల వంటి కొన్ని మందుల వలన వైట్ హెడ్స్ మరియు మోటిమలు ఏర్పడతాయి.

3. ఆండ్రోజెన్ హార్మోన్ పెరుగుదల
పురుష సెక్స్ హార్మోన్ ఆండ్రోజెన్ పురుషులు మరియు మహిళలలో వేర్వేరుగా ఉంటుంది. హార్మోన్ పునఃస్థాపన చికిత్స లేదా మొనోఫాజ్ కారణంగా మహిళల్లో ఆండ్రోజెన్ హార్మోన్ పెరుగుదలతో వైట్ హెడ్స్ మరియు మొటిమలు వస్తాయి.

4. వంశపారంపర్యం
సిబం ఉత్పత్తి వంశపారంపర్యం మరియు జన్యువుల కారణంగా నియంత్రించబడుతుంది. జన్యువులు మరియు హార్మోన్లు చర్మంను మరింత సున్నితంగా చేయవచ్చు. ఇటువంటి వారు ఎక్కువగా వైట్ హెడ్స్ కి గురి అయ్యే అవకాశం ఉంది.

5. మేకప్ మరియు సౌందర్య సాధనాలు ఉపయోగించటం
మేకప్ మరియు సౌందర్య సాధనాలను ఎక్కువగా వాడుట వలన చర్మ రంద్రాలకు అడ్డుపడి వైట్ హెడ్స్ మరియు మొటిమలు రావటానికి కారణం అవుతుంది.