ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి..అందరూ తెలుసుకోండి       2018-05-26   05:57:24  IST  Lakshmi P

తెల్ల జుట్టు ఇది ఒకరి సమస్యే కాదు చాలా మంది బాధపడుతున్న సమస్య..జుట్టు తెల్లబడడానికి అనేక కారణాలు ఉంటాయి.విటమిన్ల లోపం మరియు ముఖ్యంగా వంశ పారంపర్యం కారణంగా కూడా జుట్టు తెల్లబడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆహార లోపాలు, ఒత్తిడి వంటివి కూడా దీనికి కారణం. వాతావరణ కాలుష్యం కూడా దీనికి ఒక కారణమే. థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి, ఆందోళన, హెయిర్ ఫాల్స్ కు వాడే షాంపూలు కూడా జుట్టు తెల్లబడేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ రోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా అందరి వెంట్రుకలు తెల్లబడుతున్నాయ్. టూత్ పేస్ట్, సోపు, షాంపూలు కొనుక్కున్నట్లే ప్రతి ఇంట్లో ఓ హెయిర్ కలర్ డబ్బా ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉంచుకోవాల్సి వస్తోంది.

ఎప్పుడూ ఒకే రకమైన షాంపూను వాడడం మంచిది. మన ఇంట్లో దొరికే వాటితో సహజమైన చిట్కాలతో తెల్ల జుట్టును ఈజీగా నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల జుట్టును అధిగమించేందుకు నిపుణులు ఇచ్చే సలహాల్లో టాప్ 4 టిప్స్ ఇప్పుడు చూద్దాం.. ఆ నాలుగు టిప్స్ లో ఏ ఒక్కటి పాటించినా తెల్ల జుట్టు దెబ్బకు మాయమైపోతుందని వెల్లడిస్తున్నారు. లేదంటే వారానికి ఓ టిప్ చొప్పున మార్చి మార్చి వాడినా సరే సమస్య నుంచి బయటపడొచ్చు..

చిట్కా : 1

గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జికతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్ ని తలకు ప్యాక్ గా వేసుకోవాలి. ప్యాన్ ని 2 గంటల పాటు ఉంచుకుని గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. రసాయనాల్లేని షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

-

చిట్కా : 2

మందార ఆకు తీసుకుని పేస్ట్ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి ప్యాక్ లా చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ని జుట్టుకి అప్లయ్ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి 2సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

చిట్కా : 3

హెన్నా పౌడర్ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. హెర్బల్ హెన్నా లో బీట్ రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.

-

చిట్కా : 4

కాఫీ పౌడర్ కూడా తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా పారదోలుతుంది. ఓ గ్లాసుడు నీళ్లలో కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.

పైవన్నీ క్రమం తప్పకుండా వాడితే వెంట్రుకలు తెల్లగా మారడాన్నీ నియత్రించవచ్చు..