మిళ సూపర్ స్టార్ విజయ్ తెలుగులో ఇప్పటి వరకు ఒక్క మంచి కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు.తోటి హీరోలు టాలీవుడ్‌ను దున్నేస్తుంటే విజయ్ మాత్రం అంతగా రాణించలేక పోతున్నాడు.
అయితే ఈసారి విజయ్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.తెలుగులో దాదాపుగా 700 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఫలితంపై అంతా ఆసక్తిగా ఉన్నారు.మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఒక కాలేజ్ ఫుట్ బాల్ టీం వరుసగా పరాజయాల పాలు అవుతూ ఉంటుంది.వారు సక్సెస్ అనేదే మర్చి పోయిన సమయంలో వారికి కోచ్‌గా మైకేల్(విజయ్) కోచ్‌గా వస్తాడు.మైకేల్ తండ్రి ఒక గూండా.రౌడీల గ్యాంగులకు మరియు ఆ కాలేజ్ ఫుట్‌బాల్ టీంకు సంబంధం ఏంటీ, అసలు మైకేల్ ఆ కాలేజ్ టీంకు ఎందుకు కోచ్ అయ్యాడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోండి.
నటీనటుల నటన :
తమిళ సినీ ప్రేక్షకులు విజయ్‌ని నెం.1 అంటూ పిలుచుకుంటారు.అలాంటి విజయ్ నటనకు పెద్దగా వంక పెట్టేది ఏమీ లేదు.
ఆయనకు ఇచ్చిన రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు.ముఖ్యంగా ఓల్డ్ యేజ్ పాత్రకు అన్ని విధాలుగా మంచి ప్రతిభ కనబర్చాడు.
ఆయన డైలాగ్స్ కాస్త సింక్ అవ్వక పోవడం వల్ల తెలుగు ప్రేక్షకులు ఆయన నటనకు సింక్ అవ్వడం కష్టం.ఇక హీరోయిన్ నయనతార తనవంతు సినిమాకు గ్లామర్ అందించింది.
అయితే కథలో ఈమెకు పెద్దగా ప్రాముఖ్యత లేదు.ఇక ఫుట్ బాల్ టీంలోని సభ్యులు అయిన అమ్మాయిలు అంతా మంచి నటనతో మెప్పించారు.
ఇక కమెడియన్స్.విలన్స్ అంతా కూడా పర్వాలేదు అనిపించారు.
టెక్నికల్ : ఏఆర్ రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.అయినా కూడా పాటలు పెద్దగా గొప్పగా లేవు.కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది.ముఖ్యంగా కొన్ని సీన్స్‌ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పీక్స్‌కు తీసుకు వెళ్లింది.సినిమాటోగ్రఫీ బాగుంది.ఫుట్ బాల్ గేమ్ మరియు యాక్షన్ సన్నివేశాల సమయంలో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది.
ఇక దర్శకుడు అట్లీ కుమార్ కథను ఇంకాస్త బలంగా మార్చడంతో పాటు స్క్రీన్‌ప్లేను ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగించి ఉంటే బాగుండేది.ఎడిటింగ్‌లో కొన్ని లోపాలున్నాయి.
ఫుట్ బాల్ ఆట సీన్స్ కొన్ని సార్లు బోరింగ్‌గా అనిపించింది.ఇక నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి.
విశ్లేషణ :
విజయ్ తమిళంలో సూపర్ స్టార్ అయిన తెలుగులో మాత్రం కనీసం ఒక చిన్న హీరో స్థాయి మార్కెట్ కూడా లేదు.అయినా ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు.
ఆయన అతి నమ్మకంతో ఈ చిత్రాన్ని ఏకంగా 700 థియేటర్లలో విడుదల చేశాడు.ఆయన పెట్టుబడి రావడం కష్టమే అనిపిస్తుంది.
ఎందుకంటే సినిమా తమిళ ఆడియన్స్‌కు నచ్చుతుందేమో కాని తెలుగు ఆడియన్స్‌కు కాస్త దూరంగా ఉంటుంది.ఎందుకంటే తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉండటంతో పాటు, కథ కూడా తమిళులకు చెందినదిగా ఉంది.
అట్లీ కుమార్ చాలా ఎక్కువగా యాక్షన్ చూపిస్తాడు.కాని మనోళ్లకు కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ రొమాన్స్.
ఆ రెండు ఈ సినిమాలో తగ్గాయి.ఓవరాల్‌గా విజయ్‌ని అభిమానించే వారికి ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది.
ప్లస్ :
కొన్ని ఫుట్‌బాల్ సీన్స్, విజయ్, నయనతార
మైనస్ :
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, పాటలు
బోటం లైన్ :
తెలుగు వారికి మళ్లీ నచ్చని విజయ్
రేటింగ్ : 2.25/5.0