కోమాలో ఉన్న కొడుకు పై ఆశలు వదిలేసుకొని అవయవదానం చేస్తుండగా.. భారీ ట్విస్ట్..!!

వైద్య రంగంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతుంటాయి.అసలు బతకరు అనుకున్న వ్యక్తులే మృత్యువును జయించి వైద్యులను ఆశ్చర్యపరిచిన సందర్భాలు కోకొల్లలు.

 While Giving Up Hope On His Son Who Is In A Coma And Limping  A Huge Twist , Com-TeluguStop.com

తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి ఇంగ్లండ్​లోని స్టాఫోర్డ్‌షైర్ చోటు చేసుకుంది.మార్చి 13 వ తేదీన లూయిస్ రాబర్ట్స్ అనే ఒక పద్దెనిమిదేళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.

తన వ్యాన్​లో హార్టింగ్టన్ స్ట్రీట్‌ జంక్షన్ సమీపంలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న మరొక వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో రాబర్ట్స్ తీవ్రంగా గాయపడ్డాడు.దీనితో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అయితే తలకి బాగా గాయం కావడంతో సదరు యువకుడు కోమాలోకి వెళ్లిపోయాడని.పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తల్లిదండ్రులకి చెప్పారు.

నాలుగు రోజుల తర్వాత అనగా మార్చి 17వ తేదీన కూడా రాబర్ట్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని.బ్రెయిన్ డెడ్ అవటం వల్ల అతడు బతికే ఛాన్స్ లేదని వైద్యులు తేల్చి చెప్పారు.

దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.తమ కొడుకు ప్రాణాలు పోయినా ఇతరుల ప్రాణాలు అయినా నెలబెడితే చాలు అని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు.

అందుకే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఏడుగురికి అవయవాల దానం చేసి వారి ప్రాణాలను కాపాడాలని రాబర్ట్స్ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.తల్లిదండ్రులను నిర్ణయాన్ని విన్న తర్వాత వైద్యులు కూడా కృతిమ శ్వాస అందించే ఆక్సిజన్ తీసేశారు.

ఐతే అవయవాలు సేకరించేందుకు గంట ముందనగా అనూహ్యంగా లూయిస్ రాబర్ట్స్ కోమాలో నుంచి బయటకు వచ్చి తన కాళ్ళు చేతులు కలపడంతో పాటు తలను అటు ఇటు తిప్పుతూ సాగాడు.ఇది గమనించిన వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు.

అనంతరం వెంటనే అతడికి మెరుగైన వైద్యం అందించడం ప్రారంభించారు.అయితే ఈ విషయాన్ని రాబర్ట్స్ సోదరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

దీంతో నెటిజన్లు అతడి వైద్యానికి అయ్యే ఖర్చు తాము ఇస్తామని ముందుకు వస్తున్నారు.ఇప్పటికే “గో ఫండ్ మీ” వెబ్ సైట్ లో రాబర్ట్స్ కోసం విరాళాలు సేకరించడం ప్రారంభించారు.

ప్రస్తుతం భారీ ఎత్తున విరాళాలు రాబర్ట్స్ కి అందుతున్నాయని సమాచారం.ఏది ఏమైనా అదృష్టవశాత్తు ఈ 18 ఏళ్ల యువకుడు మృత్యువును జయించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube