టెర్రస్‌పై డ్యాన్స్ చేస్తూనే.. ఒక్కసారిగా సిగ్గుతో పరిగెత్తిన యువతి... వీడియో వైరల్..

ఈరోజుల్లో సోషల్ మీడియా ప్రభంజనం పెరిగిన తర్వాత చాలా మంది అమ్మాయిలు డ్యాన్స్ లు వేస్తూ అందరిని అలరిస్తున్నారు.ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇంకా తదితర ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా వీరు తమ నాట్య ప్రతిభను చాటుకుంటున్నారు.

 While Dancing On The Terrace A Young Woman Who Ran Away With Shame At Once Vide-TeluguStop.com

అయితే కొందరు మాత్రం భయంతో కూడిన సిగ్గుతో డ్యాన్సులు గట్రా రహస్యంగా చేస్తున్నారు.తాజాగా ఈ కోవకు చెందిన ఒక యువతి డ్యాన్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యింది.

ఆ తర్వాత ఆమె సిగ్గుతో, భయంతో పరిగెత్తుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి టెర్రస్‌పై డ్యాన్స్ చేయడం చూడొచ్చు.ఈ యువతి డ్యాన్స్ ను ఒక ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేయడం కూడా గమనించవచ్చు.

ఈ యువతి ఒక బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది.అయితే ఈమె నాట్యాన్ని ఇరుగుపొరుగువారు చూస్తూ అలాగే ఉండిపోయారు.

ఈ విషయాన్ని ఆ యువతి గమనించకుండా అలానే నాట్యం చేయసాగింది.అయితే పొరుగు వారు అందరూ తననే చూస్తున్నారని తరువాత గమనించిన ఆ యువతి చాలా సిగ్గుగా ఫీలయ్యింది.

అనంతరం అక్కడి నుంచి తలదించుకుని పరిగెత్తింది.ఈ ఫన్నీ వీడియో కి ఇప్పటికే 30 వేలకు పైగా వ్యూస్, రెండు వేలకు పైగా లైకులు వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.అంత సిగ్గు భయం ఉన్న అమ్మాయి టెర్రస్‌ చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోవద్దా అని మరికొందరు సలహా ఇస్తున్నారు.

ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube