ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తుండగా పాపం ఘోరం జరిగిపోయింది.. ?

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఒక పాము ఏడాదిన్నర వయసున్న పాపకు తల్లిని దూరం చేసింది.

 While A Mother Give Milk Feeding Her-TeluguStop.com

హృదయాన్ని కరిగించేలా ఉన్న ఈ ఘటన తాలూకూ విషయం తెలుసుకుంటే.

మహారాష్ట్రలోని, చంద్రాపూర్‌ మండలం, సోనాపూర్‌ నుంచి కొందరు కూలీలు ఉపాది నిమిత్తం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరు వచ్చారు.

 While A Mother Give Milk Feeding Her-ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తుండగా పాపం ఘోరం జరిగిపోయింది.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరంతా గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటు మిరప కోతలకు వెళుతున్నారట.
ఈ క్రమంలో ఆ గుడారంలో మంగళవారం రాత్రి ఆదమరచి నిద్రపోతున్న వేళ తన బిడ్ద ఏడ్వడంతో మెలకువ వచ్చిన ఆ తల్లి తన పసిది ఆకలికి ఏడుస్తుందని భావించి బిడ్డను పొదివి పట్టుకుని తన స్తనం నోటికి అందించిందట.

అంతలో ఎక్కడ నుంచి వచ్చిందో గానీ ఓ పాము తల్లి శ్రుతి రొమ్ముపై కాటేసిందట.
దీంతో తన బిడ్దను కూడా ఆ పాము పొట్టన పెట్టుకుంటుందని భావించిన ఆ తల్లి తన గురించి భయపడకుండా ఆ పామును చేతితో పట్టుకుని ఓ వైపు విసిరేసిందట.

ఆ చీకట్లో రూపేష్‌ ప్రకాష్‌ చప్డే అనే యువకుడిపై పడి ఆ పాము అతడినీ కూడా కాటేసిందట.ఇక ఆ తల్లి అరపులకు మెలకువ వచ్చిన మిగతా వారు వెంటనే వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శ్రుతి మరణించిందట.

కాగా ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.

#Child #Mother #SnakeBites #Snake Biting #Milk Feeding

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు