గౌరవం ఇవ్వని, ఎవ్వరిని లెక్కచేయని ఇష్టానుసారంగా ప్రవర్తించే రాశులు   Which Zodiac Signs Are The Most Dishonest?     2018-02-17   21:36:11  IST  Raghu V

ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తికీ గౌరవం ఇస్తే ఎదుటివారు కూడా గౌరవం ఇస్తారు. ప్రతి మనిషికి గౌరవం ఇవ్వటం అనేది మనిషి యొక్క కనీస ధర్మం. కొంత మంది ఆ కనీస ధర్మాన్ని పాటించరు. రాశుల వారు వారు తప్పు చేసిన సరే ఎదుటి వారిని నిందిస్తూ ఉంటారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఎవరిని లెక్కచేయరు. రాశుల వారికీ గౌరవం ఇవ్వాలంటేనే చాలా చిరాకుగా ఉంటుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
ఈ రాశి వారికీ మనస్సులో ఏదైనా చేయగలమని అనుకుంటారు. కాస్త ఎక్కువ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. ఎప్పుడు స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. వీరి మీద ఎవరైనా అధికారం చెలాయిస్తే విపరీతమైన కోపం వస్తుంది. ఈ రాశి వారు ఎవరికీ గౌరవం ఇవ్వరు. ఎవరైతే నాకేంటి అనే ధోరణిలో ఉంటారు. వారి వ్యక్తిగత విషయాలు ఎవరికి తెలియకుండా ఉండాలని అనుకుంటారు. ఎవరైనా వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం వారిని తిట్టటానికి వెనకడుగు వేయరు.


సింహ రాశి
వీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు అసలు భయపడరు. అలాగే ఎవరు ఏమి అన్నా పెద్దగా ఆందోళన పడరు. ఈ రాశి వారు తమకు నచ్చినట్టే ఉంటారు. ఎవరు ఏమి చెప్పిన వినరు. వారికీ నచ్చిందే చేస్తారు. ఎదుటి వారికీ అసలు గౌరవం ఇవ్వరు. వీరు తప్పు చేసిన ఒప్పుకోరు. తప్పు చేసావని అన్నవారిపై దురుసుగా ప్రవర్తిస్తారు.

మిధున రాశి
ఈ రాశి వారు పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. వీరి మనస్తత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఈ రాశి వారు ఎవరికీ గౌరవం ఇవ్వరు. వారికి ఇష్టం వచ్చినట్టు మాత్రమే ఉంటారు. వీరి ప్రవర్తన కారణంగా అందరు వీరికి దూరం అవుతూ ఉంటారు.

వృశ్చిక రాశి
ఈ రాశివారు ఎదుటి వ్యక్తికీ పెద్దగా రెస్పాండ్ అవ్వరు. వీరు అబద్దాలు చెప్పటమే కాకుండా నమ్మించి మోసం చేయటంలో దిట్ట. వీరు చెప్పే అబద్దాలు బయట పడకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. వీరు డబుల్ గేమ్ ఆడుతూ ఉంటారు.