తప్పక తెలుసుకోండి : ఇంట్లో ఎలాంటి చెట్లు ఉండాలి ఇంటి బయట ఎలాంటి చెట్లు ఉండాలో తెలుసా

పెద్దలు చెప్పిన ప్రతి విషయంలో ఏదో ఒక కారణం ఉంటుంది.ఉదాహరణకు ఇంటి ముందు ఆవు పేడ నీటిని చల్లాలని చెప్తారు.

 Which Type Of Trees Should Present In House-TeluguStop.com

ఇంటి ముందు ఆవు పేడ నీటిని చల్లడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైటిఫిక్‌గా కూడా నిరూపితం అయ్యింది.ఇంటిలోకి బ్యాక్టీరియా మరియు వైరస్‌ వంటివి రాకుండా ఇది చూడటంతో పాటు, రకరకాల అనారోగ్యక కారణాల నుండి దూరంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

ఇక ఇంటి ముందు దుమ్ము లేవకుండా కూడా ఉంటుంది.సాదారణ నీటితో చల్లడం వల్ల కొద్ది సేపటికే దుమ్ము లేస్తుంది.

అదే పేడ నీటిని చల్లడం వల్ల ఇంట్లో మాదిరిగా దుమ్ము లేవకుండా ఉంటుంది.ఇలా పెద్దలు ఏం చేసినా కూడా సైటిఫిక్‌ లాజిక్స్‌ కూడా ఉన్నాయి.

ఇక పెద్దలు ఇంట్లో కొన్ని రకాల చెట్లను పెంచుకోవడం వద్దు అంటారు.వాటిలో ముఖ్యమైనది అరటి చెట్టు.ఇంట్లో అరటి చెట్టు పెరగడం ఎంత మాత్రం మంచిది కాదని అంటారు.అరటి చెట్టు ఎక్కువగా దోషాలను కలిగి ఉంటుందని అంటారు, ఎవరికైనా దోషం ఉండి పెళ్లి కాకుంటే అరటి చెట్టుకు పెళ్లి చేస్తూ ఉంటారు.

అలా అరటి చెట్టుకు దోషం వెళ్తుంది.అలాంటి చెట్టును ఇంట్లో ఉంచుకుంటే మంచిది కాదని పెద్దలు కూడా అంటూ ఉంటారు.

ఇక ములగ చెట్టు కూడా ఇంటి ఆవరణలో ఉండటం మంచిది కాదని అంటారు.అలాగే ఇంటి ప్రహారి గోడకు లోపలి వైపు ఎలాంటి ముల్ల చెట్లు కూడా ఉండకూడదని పెద్దలు అంటూ ఉంటారు.

ముల్ల చెట్లు దోశ నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు.అలాంటి ముల్ల చెట్లను ఇంటికి బయట పెట్టుకోవాలి.ఎలాంటి చెడు ప్రభావిత అంశాలు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి.ఇంటి మెయిన్‌ గేట్‌ బయట అంటూ పూర్తిగా బయట ముల్ల చెట్లను పెంచాల్సి ఉంటుంది.

వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో పాటు, చెడు దృష్టి అనేది ఇంటిపై పడదు.ఇంకా కొన్ని రకాల పూల చెట్లను ఇంట్లో పెంచితే పర్వాలేదు, కాని ఇంట్లో బంతి చెట్లను పెంచడం మంచిది కాదు అంటారు.

బంతి చెట్లకు ఎక్కువగా పురుగు వస్తుంది.వాటి కోసం వచ్చే పురుగులు ఇంట్లో వారికి ఇబ్బంది పెట్టడం, ఇంట్లోకి, వంట గదిలోకి రావడం వంటివి చేస్తాయి.

అందుకే బంతి చెట్టను కూడా ఇంట్లో పెంచక పోవడమే ఉత్తమం అంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube