పేరును బట్టి ఇంటి ప్రధాన ద్వారం ఏ వైపు ఉండాలో తెలుసా.?

హిందూ సాంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రానికి ఇచ్చినంత ప్రాధాన్యత మరే దేనికి ఇవ్వరు.ఏ వస్తువు కొనాలన్నా, లేదా ఇంటిని కొనాలన్నా కొన్నిసార్లు అద్దె ఇళ్లలో ఉన్న ఆ ఇంటి వాస్తును పరిశీలిస్తాము.

 Vasthu Shastram For Main Door Entrance, Vastu Tips, Name Of Letters, Hindhu Beli-TeluguStop.com

ఏమాత్రం వాస్తు శాస్త్రానికి కొద్దిగా తేడా ఉన్నా ఎంతో నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఆఖరికి మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువును ఒకచోట పెట్టాలన్నా కూడా వాస్తు ప్రకారం పెడితే మంచిదని వాటిని మారుస్తూ ఉంటారు.

ఇంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న వాస్తు శాస్త్రానికి మనం నివసిస్తున్న ఇంటి ముఖద్వారం ఎటువైపు ఉండాలో తెలుసా? పేరును బట్టి ఇంటి ముఖద్వారం ఏ వైపు ఉంటే మనకు మంచి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖ ద్వారం కేవలం కుటుంబానికి ప్రవేశద్వారం మాత్రమే కాదు బయట ప్రపంచం నుంచి ఎన్నో అతీతమైన శక్తులు మన ఇంటి లోనికి ఈ ద్వారం ద్వారా వస్తాయి.

అంతేకాకుండా సిరి సంపదలు కూడా ద్వారం అంటే వస్తాయి.మన కుటుంబానికి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చి పెట్టే ముఖద్వారాన్ని ఎప్పుడూ కూడా ఉత్తరం, ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిశలో ఉండాలి.

ఎందుకంటే ఈ దిశలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.అయితే కొన్ని వాస్తు శాస్త్రం ప్రకారం పేరును బట్టి ఇంటి ముఖద్వారం ఎటు వైపు ఉండాలంటే

  • పేరులోని మొదటి అక్షరం అ నుంచి మొదలై ఆః వరకు పేరు మొదలైనవారు, వారి ఇంటి ద్వారాన్ని ఉత్తరం, పడమర, దక్షిణ దిశ వైపు ఉండేలా చూసుకోవాలి.

  • ‘క’ నుంచి ‘ఙ’ వరుకు మొదటి అక్షరంతో మొదలయ్యే వారు వారి ఇంటి ముఖద్వారాన్ని ఎల్లప్పుడు దక్షిణం, పడమర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి.
  • ‘చ’ నుంచి ‘ఞ’ వరకు మొదటి అక్షరం తో మొదలయ్యే పేర్లు ఉన్నవారు వారి ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎల్లప్పుడూ తూర్పు, పడమర, ఉత్తరం దిశలో ఉండేలా నిర్మాణం చేపట్టాలి.

  • ట నుంచి ణ వరకు మొదటి అక్షరం తో పేర్లు గలవారు తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఇంటి ద్వారాన్ని నిర్మించుకోవాలి.
  • త నుంచి న వరకు మొదటి అక్షరం గల పేర్లు ఉన్నవారు తూర్పు, ఉత్తరం వైపు ఇంటి ద్వారానే నిర్మించుకోవాలి.

  • ప నుంచి మ వరకు గల పేర్లు ఉన్నవారు వారి ఇంటి ద్వారాలు ఎల్లప్పుడు తూర్పు, ఉత్తరం దిశలో ఉండాలి
  • * య నుంచి వ వరకు పేర్లు ఉన్న వారు వారి ఇంటి ద్వారాన్ని తూర్పు, దక్షిణం, పడమరవైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • * శ, ష, స, హ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు వారి ఇంటి ద్వారాలను దక్షిణ, తూర్పు దిశలో ఉండాలి.

ఇలా సరైన వాస్తు ప్రకారం లో ఇంటి ద్వారాలను నిర్మించుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అనుకూల వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆ ఇల్లు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ,సిరిసంపదలను కలిగి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube