అయ్యో... అది పవన్‌ కొడుకు కాదట!  

Which Post Is Viral On Social Media Is Not Pawan Kalyan Son-akhira Nandan Post,janasena Party,pawan Kalyan Janasena,pawan Kalyan Son,post Is Viral On Social Media

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పి పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారి మరో మూడు రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత తీవ్రంగా ఉన్నా, డీ హైడ్రేషన్‌ దెబ్బతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎన్నికల ప్రచారంను మానుకోకుండా అలాగే పోరాడుతున్నాడు. పగలు సమయంలో డీ హైడ్రేషన్‌కు చికిత్స తీసుకుంటూ సాయంత్రం సమయంలో ప్రచారంలో పాల్గొంటున్నాడు..

అయ్యో... అది పవన్‌ కొడుకు కాదట!-Which Post Is Viral On Social Media Is Not Pawan Kalyan Son

తన తండ్రి పడుతున్న కష్టం పట్ల అఖీరా స్పందిస్తూ తాజాగా సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ కనిపించింది. తన తండ్రి చాలా కష్టపడుతున్నాడు అంటూ అకీరా బాధపడుతూ ఒక పోస్ట్‌ను అఖీరా పేరు మీద సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది కాస్త వైరల్‌ అయ్యింది. జనసైనికులు దాన్ని వైరల్‌ చేశారు.

దాంతో అఖీరా బాధ గురించి రాష్ట్ర ప్రజలు మొత్తం చర్చించుకున్నారు. అయితే తీరా చూస్తే అది అసలు అఖీరా పోస్ట్‌ కాదట, అది అఖీరా అఫిషియల్‌ అకౌంట్‌ కాదట..

ఎవరో పవన్‌ కళ్యాణ్‌ గుర్తు తెలియని ఫ్యాన్‌ దాన్ని క్రియేట్‌ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున మీడియాలో ఆ విషయమై స్పందన వచ్చిన నేపథ్యంలో కొందరు జనసేన నాయకులు ఆ విషయమై క్లారిటీ ఇచ్చాను.

అఖీరా పోస్ట్‌ కాదు అంటూ క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్‌కొందరు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అఖీరా ఏం చేస్తున్నాడు, అసలు ఎక్కడ ఉన్నాడు అంటూ వాకబు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అఖీరా తన తల్లి రేణుదేశాయ్‌తో కలిసి పుణెలో ఉంటున్న విషయం తెల్సిందే..