మంత్రి పదవా రాజ్యసభ ? కవితకు ఏం డిసైడ్ చేశారు ?

తెలంగాణలోనూ రాజ్యసభ ఎన్నికల హడావుడి కోలాహలంగా ఉంది.ఎవరికి వారు తాము రాజ్యసభ సభ్యత్వం పొంది బిల్లులో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నారు.

 Which Post Decide To Trs Kavitha-TeluguStop.com

ఇప్పటికే టీఆర్ఎస్ లో సీనియర్ నాయకులు చాలామంది రాజ్యసభ స్థానం కోసం పోటీ పడుతున్నారు.టిఆర్ఎస్ కు రెండు స్థానాలు దక్కబోతుండడంతో నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు.

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో టిఆర్ఎస్ ల పోటీ నెలకొంది.ముఖ్యంగా మాజీ ఎంపీ కేసీఆర్ కుమార్తె కవిత కు రాజ్యసభ స్థానం దక్కుతుందా లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన కవిత అప్పట్నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Telugu Kavitha, Kavitharajya, Kcr Kavitha, Kcr Federal, Trs Kcr-Political

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ ఆమె ప్రచారానికి వస్తారని హడావుడి జరిగినా ఆమె మాత్రం దూరంగానే ఉన్నారు.దీంతో ఆమెను మళ్లీ రాజకీయంగా యాక్టివ్ చేసేందుకు ఏదో ఒక పదవి ఇవ్వాలని చాలాకాలంగా కేసీఆర్ భావిస్తున్నారు.ఆమెకు కేసీఆర్ ఏ పదవిని కట్టబెడతారు అనేది సస్పెన్సు గా మారింది.

ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న కేసీఆర్ తన కుమార్తె కవితని కూడా ఢిల్లీ రాజకీయాల్లో యాక్టివ్ చేసి ఫెడరల్ ఫ్రంట్ బలోపేతం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఇంగ్లీష్, ఉర్దూ భాషలు కూడా కవిత అనర్గళంగా మాట్లాడగలరు కాబట్టి జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ వాయిస్ బలంగా వినిపించాలి అని కెసిఆర్ నమ్ముతున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ లో సీఎం గా కేటీఆర్ ఉంటాడు కాబట్టి తనకు ఏ ఇబ్బంది ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Telugu Kavitha, Kavitharajya, Kcr Kavitha, Kcr Federal, Trs Kcr-Political

ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కవితను ఉంచాలని, మంత్రి పదవి ఇవ్వాలని కెసిఆర్ భావిస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆమెకు రాజ్యసభ సభ్యత్వం కానీ, లేక రాత్రి మంత్రి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఇక రాజ్యసభ సభ్యత్వం టిఆర్ఎస్ నాయకులు చాలా మంది పోటీ పడుతున్నారు.

తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు కె.కేశవరావు మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నారు.ఆయనతో పాటు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, స్పీకర్ సురేష్ రెడ్డి ఇలా చాలా మంది రాజ్యసభ సభ్యత్వం పై ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube