ఏపీలో ఎవరు గెలుస్తారు ..? ఓ ఛానెల్ సర్వే !  

  • ఏపీ రాజకీయాల మీద అందరికి ఆసక్తి పెరిగిపోతోంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నా… రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతోంది? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ? ఇలా రకరకాల కోణాల్లో ఇప్పటికే అనేక సర్వే సంస్థలు రంగంలోకి దిగి సర్వే రిపోర్ట్స్ బయటపెట్టాయి. తాజాగా తెలుగు మీడియాలో అగ్రగామిగా ఉన్న ఓ న్యూస్ ఛానెల్ సర్వే చేస్తోందట. దాదాపు సర్వే ముగిసిందనిఫలితాలను మాత్రం ఇప్పట్లో ప్రకటించకుండా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారట.

  • Which Party Will Win In Andhra Pradesh 2019 Elections-

    Which Party Will Win In Andhra Pradesh In 2019 Elections

  • అయితే ఈ న్యూస్ ఛానెల్ చేపట్టిన సర్వే ప్రకారం ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని తేలిందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు పనితీరుపై ప్రజల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై వారు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని తేలిందట. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న సంతృప్తి, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరుల అండదండలు, పోల్‌ మేనేజ్‌మెంట్‌తో టిడిపి కష్టంగా అయినా అధికారంలోకి వస్తుందని ఆ ఛానెల్ సర్వేలో తేలిందట.

  • ఇక ఈ సర్వేలో తేలిందని ప్రకారం … వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నా… ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడంలేదని,
    కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న ఇన్‌ఛార్జిలను మార్చడంతోచాలా చోట్ల తిరుగుబాట్లు వ్యక్తం అవుతున్నాయని, నమ్ముకున్నోళ్లకు ‘జగన్‌’ న్యాయం చేయడం లేదనిఈ పరిణామాలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయని తేలిందట. సమస్యలు ఎన్ని ఉన్నా…అధికార టిడిపికి వైసీపీ గట్టిపోటీ ఇస్తుందని సర్వేలో తేలిందని చెబుతున్నారు.

  • Which Party Will Win In Andhra Pradesh 2019 Elections-
  • ఇక ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా ఉండబోదని కేవలం గోదావరి జిల్లాల్లోనే ‘పవన్‌’ ప్రభావం ఉంటుందని…సర్వేలో తేలిందట. ఇక్కడ జనసేన రెండు నుంచి నాలుగు సీట్లు సాధిస్తారని, ఐదు శాతం ఓట్లు ఆయన పార్టీకి వస్తాయని తేలిందట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…రాయలసీమ ప్రాంతంలో ఆ పార్టీకి ఒక శాతం ఓట్లు కూడా రావట. రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోణపు పోటీ జరిగితే పవన్‌ పార్టీ రెండు శాతం ఓట్లు సాధిస్తేగొప్పేనని సర్వేలో తేలిందట. అధికారికంగాఆ టీవీ సర్వే సంస్థ వివరాలను బయటపెట్టకపోయినా కొంత మంది రాజకీయ నాయకులకు లీకులు ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.