ముద్రగడ మాట చెల్లుబాటయ్యే ఛాన్స్ ఉందా ....  

చాలా కాలంగా రాజకీయ అజ్ఞాతవాసం కొనసాగిస్తూ… కాపు రిజర్వేషన్ అంశంతో తెర మీదకు వచ్చి రాజకీయ పార్టీలకే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్న ముద్రగడ పద్మనాభం వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం ముద్రగడ అంతరంగం ఏంటి..? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నాడు..? అసలు ఆయన ప్రభావం రాజకీయ పార్టీల మీద ఎలా ఉండబోతోంది అనే అంశాలపై ప్రస్తుతం అందరూ దృష్టిసారించి లెక్కలు తేల్చే పనిలో పడ్డారు.

Which Party To Support Mudragada Padmanabham-

Which Party To Support Mudragada Padmanabham

ఇక ముద్రగడ వ్యవహారం చూసుకుంటే… ఒక వైపు వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితంగా మెలుగుతున్నట్టు కనిపించిన ఆయన ఆ తరువాత జగన్ కాపు రిజర్వేషన్ మీద చేతులెత్తెయ్యడంతో ఆయన మీద ఇప్పుడు ఒంటికాలిపై లేస్తున్నాడు. వాస్తవానికి గత నాలుగేళ్లలో ముద్రగడకు అండగా నిలిచింది వైసీపీ నే . జగన్ కు చెందిన మీడియా సంస్థ సాక్షి కూడా ముద్రగడకు చాలా వరకూ సపోర్టుగా నిలిచింది. టీడీపీ తనపై , తన కుటుంభం సభ్యులపై ఏవిధంగా దాడి చేసిందో స్వయంగా ముద్రగడే చెప్పాడు. లోకేష్ తన కుటుంబీకులను అనరాని మాటలను అన్నాడని.. తమపై పోలీసుల దాడిలో లోకేష్ ప్రమేయం ఉందని అప్పట్లో ముద్రగడ సంచలనం వ్యాఖ్యలే చేసాడు.

కానీ ఇంతలో ఏముందో ఏమో తెలియదు కానీ ఆకస్మాత్తుగా ఆయన యూ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. కాపు రిజర్వేషన్ మీద అసలు మోసం చేసిన వ్యక్తి బాబు. కానీ ఆ విషయాన్ని ముద్రగడ మర్చిపోయాడు. బాబు ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. కేవలం జగన్ టార్గెట్ గానే ఆయన విమర్శలు చేస్తున్నాడు. ఇక ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన ప్రకటననూ ఈయన స్వాగతించేశాడు. ఇప్పుడు ముద్రగడ ఎవరి వైపు? తెలుగుదేశం వైపు నిలుస్తాడా? పవన్ కల్యాణ్ వైపు నిలుస్తాడా? అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

Which Party To Support Mudragada Padmanabham-

ఇటీవల యనమల మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్ల అంశం తమ చేతిలో ఏమీ లేదని అన్నాడు. అది కేంద్రం తేల్చాలని అన్నాడు. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం యనమల వ్యాఖ్యల పట్ల స్పందించనే లేదు. దీంతో ముద్రగడ టీడీపీ వైపు చూస్తున్నాడని, ఆ పార్టీకే మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఇక వైసీపీతో వ్యవహారం చెడడానికి కారణం ఆ పార్టీతో ముద్రగడ డీల్ బెడిసికొట్టడమే కారణం అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీలో ముప్పై సీట్లు తను చెప్పిన వారికి కేటాయించాలని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరాడని, అయితే ఈ వ్యవహారాన్ని జగన్ బొత్సకు అప్పజెప్పగా కొన్ని సీట్లు ఇస్తాం కానీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కష్టమని బొత్స తేల్చి చెప్పాడని దీంతో ఆయన వైసీపీ మీద కక్ష పెంచుకున్నాడని టాక్. ముద్రగడ ప్రభావం అంతగా ఏమీ ఉండదని మొన్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనే రుజువు అయ్యిందని కాపు ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పుడే టీడీపీ ని ఓడించాలని ఆయన పిలుపు ఇచ్చినా ఆ ప్రభావం కనిపించలేదని ఆయనకు అంత సీన్ లేదన్న విషయం అప్పుడే అర్ధం అయిపోయిందని వైసీపీ లో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.