చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన మొదటి సినిమా అయిన చిరుత సినిమాతో తండ్రి కి తగ్గ తనయుడు అన్న పేరు సంపాదించుకున్నాడు.రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా చరిత్ర సృష్టించాడు.
గత సంవత్సరం రాజమౌళి డైరక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అంతర్జాతీయంగా భారీ విజయాన్ని దక్కించుకుంది దాంట్లో భాగంగానే రామ్ చరణ్ ఇంటర్నేషనల్ స్టార్ గా పేరు సంపాదించాడు.ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా తో మరో భారీ హిట్ కొట్టబోటున్నట్టు తెలుస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి చేసిన సినిమాలు ఎన్నో సూపర్ సక్సెస్ లు సాధించాయి.అందులో రామ్ చరణ్ రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమాలు చేస్తే బాగుంటాయి అనే ప్రశ్న మెగాస్టార్ అభిమానులని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే రామ్ చరణ్ చిరంజీవి సినిమాల్లో గ్యాంగ్ లీడర్,జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు రీమేక్ చేస్తే చూడాలని ఉంది అని చాలామంది మెగా అభిమానులు వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ లో కొందరు గ్యాంగ్ లీడర్ పేరు చెప్తుంటే చాలా మంది జగదేక వీరు అతిలోక సుందరి సినిమా పేరు చెప్తున్నారు.అయితే చాలా రోజుల నుండి శ్రీదేవి కూతురు హీరోయిన్ గా, రామ్ చరణ్ హీరో గా జగదేక వీరుడు సినిమాను రీమేక్ చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నప్పటికి ఇది ఇప్పటివరకు అయితే కార్యరూపం దాల్చలేదు మరి ఫ్యూచర్ లో అయిన ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో లేదో చూడాలి.