ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలలో ఏది పెద్ద హిట్.. ఆయనే గ్రేట్ డైరెక్టర్ అంటూ?

గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్2 థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాకు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.

 Which Movie Is Bigger Hit In  Rrr And Kgf2 Movies Details, Kgf 2, Rrr Movie, Kgf-TeluguStop.com

తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంది.అయితే సోషల్ మీడియాలో కొంతమంది కేజీఎఫ్2 సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదలై ఉంటే ఆదరణ తగ్గేదని కామెంట్లు చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలలో ఏది పెద్ద హిట్ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ నచ్చితే హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం కేజీఎఫ్2 నచ్చుతుంది.రాజమౌళికి ప్రశాంత్ నీల్ రాబోయే రోజుల్లో కూడా గట్టి పోటీ ఇవ్వగలడని కేజీఎఫ్2 తో ఫిక్స్ అయింది.కేజీఎఫ్2 సినిమాలో కొన్ని సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలలో కలెక్షన్ల విషయంలో కేజీఎఫ్2 పైచేయి సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.

Telugu Salaar, Bahubali, Bigger, Yash, Ntr, Kgf Chapter, Kgf, Prabhas, Prasanth

బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాకు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.అయితే కేజీఎఫ్2 బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశం అయితే లేదు.రాజమౌళి, ప్రశాంత్ నీల్ లలో ఎవరు గొప్ప డైరెక్టర్ అంటే ఇద్దరూ గొప్ప డైరెక్టర్లు అనే చెప్పాలి.కేజీఎఫ్2 సక్సెస్ ఎన్టీఆర్, ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

Telugu Salaar, Bahubali, Bigger, Yash, Ntr, Kgf Chapter, Kgf, Prabhas, Prasanth

ప్రభాస్, ఎన్టీఆర్ లకు కూడా ప్రశాంత్ నీల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.10,000కు పైగా స్క్రీన్లలో విడుదలైన కేజీఎఫ్2 ఎంట్రీతో ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ మాత్రం ముగిసినట్లేనని చెప్పాలి.సలామ్ రాఖీభాయ్ అంటూ ప్రేక్షకులు కేజీఎఫ్2 మూవీ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు వారాల వరకు ఈ సినిమాకు పోటీ లేదనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube