ఏది నిజం ఏది అబద్దం..? అంటూ ప్రశ్నిస్తున్న ఉదయభాను..!

తెలుగు సినీ, బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరులో ఒకటి యాంకర్ ఉదయభాను.తెలుగు బుల్లితెరపై చెప్పుకోదగ్గ యాంకర్స్ లో మొదటగా నిలబడే వారిలో ఈవిడ నిలుస్తుంది.

 Anchor Udaybhanu, Ghmc Elections, Hyderabad, Vote , Viral Video, Soical Media,sw-TeluguStop.com

కేవలం బుల్లితెర యాంకర్ మాత్రమే కాకుండా సినీ నటిగా కూడా ఆవిడ అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఉదయభాను.తనదైన యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వ్యక్తి ఈవిడ.

తన మాటలను తూటాలుగా పేలుస్తూ యాంకరింగ్ చేసే స్టైల్ ఎందరికో నచ్చుతుంది.ఉదయభాను ఎప్పటికప్పుడు ప్రస్తుతం సామాజిక పరిస్థితులను ఉద్దేశించి అలాగే నిజజీవిత అంశాల పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఉదయభాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది.ఇకపోతే తాజాగా హైదరాబాద్ మహానగరంలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యం దృష్ట ఉదయభాను ఓ వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో ఉదయభాను ఎన్నికల వేళ ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నించింది.ఈ వీడియోలో ఆమె మాట్లాడిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

గ్రేటర్ హైదరాబాద్ పోరులో ఓటు హక్కు వినియోగంపై ఆవిడ ఎంతో అద్భుతంగా సందేశాన్ని తెలియజేసింది.ఎంతోమంది ఓట్లను అమ్ముకుంటున్నారని అలా ప్రజాస్వామ్య దేశంలో ఓటును అమ్ముకుంటే జరిగే అనర్ధాలపై తనదైన శైలిలో ఆవిడ వివరించింది.

జీవితం అనేది ఓ యుద్ధం అయితే అందులో గెలవడానికి మనకున్న ఆయుధం కేవలం ఓటు హక్కు మాత్రమే అని దాన్ని నిర్వీర్యం చేయొద్దు అంటూ ఆవిడ అచ్చమైన తెలుగు భాషలో స్పష్టంగా తెలియజేసింది.

ప్రలోభాలు కోసం కాదని ప్రగతి కోసం ఓటేద్దాం అంటూ ఉదయ భాను పిలుపునిచ్చింది.

ఇప్పటి వరకు అభివృద్ధి జరిగిందా.? అవినీతి పెరిగిందా.? కళ్ళారా చూస్తున్నాం.వింటున్నాం.

సామాన్యుడు స్వప్నం సాకారం అయిన కాకపోయినా మహా నేతలంతా మహా అద్భుతం గా మాట్లాడుతారు అంటూ తెలిపింది.ఇందులో భాగంగానే ఏది నిజం.

ఏది అబద్దం.అన్న ప్రశ్నకు వేరే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదని మన జీవితాలే సాక్ష్యం అంటూ ఉదయభాను మాటల తూటాలను పేల్చింది.

మన ఓటు హక్కును కొందరు వందలు వేలు వెదజల్లే కొంటున్నారు అంటే వారు లక్షణంగా లక్షలు వసూలు చేస్తారని, కోటానుకోట్లు దర్జాగా దోచేస్తారు అంటూ తెలిపింది.ఎవరైనా సరే రాబడి ఉంటేనే కదా పెట్టుబడి పెట్టేది అని తెలుపుతు ఓటు అనేది ప్రలోభాలు కాదని మనం మన స్వేదం, మన రుదిరం, మన భారతావని భవితవ్యం అంటూ ఉదయభాను జిహెచ్ఎంసి ఓటర్లకు పిలుపునిచ్చింది.

చివరగా ప్రలోభాలు కోసం కాకుండా ప్రజల కోసం ఓటు వేద్దామని ప్రజాస్వామ్యం కాపాడుకుందాం అంటూ ఆవిడ చెప్పిన మాటలు ప్రస్తుతం ఆలోచింపజేసేలా ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube