అస్తమించే సూర్యుడు గొప్పా లేకా ఉదయించే సూర్యుడు గొప్పా?

ప్రతిరోజూ ఉదయమే సూర్యుడు ఉదయిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే.అయితే చాలా మంది ఉదయించే సూర్యుడుకి ఎక్కువ శక్తులు ఉంటాయని చెప్తుంటారు.

 Which Is Greater Sunset Or Sunrise, Sunset, Sunrise, Sun Rays, Sun, Facts About-TeluguStop.com

అంతే కాకుండా పొద్దునే స్నానం చేసి ఉదయించిన సూర్యుడికి నమస్కారాలు చేస్తుంటారు.కానీ అస్తమించే సమయంలో మాత్రం ఎవరూ అలా సూర్యుడికి నమస్కారం చేయరు.

అయితే నిజంగానే ఉదియంచే సూర్యుడికి ఎక్కువ శక్తులు ఉంటాయా.అస్తమించే సూర్యుడు అంత గొప్పవాడు కాదా అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అస్తమించే సూర్యుడు ఉదయింటే సూర్యుడి అంతటి శక్తి కలవాడు కాదని మన పూర్వీకుల అభిప్రాయం.ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.సూర్య కిరణాలు ప్రయాణం చేస్తున్నప్పుడు భూమిని ఆవరించి ఉన్న గాలి ఆవరణం గుండా పోతాయి.అలా అవి గాలి యొక్కు పరమాణువులతో ఢీకొని వ్యాపిస్తాయి.

తక్కువ ప్రసరణా సామర్థ్యం ఉన్న కాంతి కిరణాలు అలా గాలి పరమాణువులతో ఢీకొని వ్యాపిస్తాయి.అలాగే ఎంత ఎక్కువ దూరం కిరణాలు గాలి ఆవరణం గుండా ప్రయాణం చేస్తాయో అవి ఎక్కువ కిరణాలు గాలి పరమాణువులను ఢీకొని వ్యాపిస్తాయి.

అస్తమించే సూర్యుడి కిరణాల నడి మధ్యాహ్న సూర్య కిరణాల కంటే పదహారు రెట్లు దూరంగా ప్రయాణం చేస్తాయి.అలా అస్తమించే సూర్య కిరణాలు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వల్ల గాలితో రాపిడికి గురై ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.

ఎక్కువ ప్రసరణా సామర్థ్యం ఉన్న ఎర్రని కిరణాలు మాత్రం అలా వ్యాపించవు.ఈ ఎర్రని కిరణాలు మన కంటిపై పడి అస్తమించే సూర్యుడు మనకు ఎర్రగా కనిపిస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube