లవ్‌ మ్యారేజ్‌ బెటరా..? అరేంజ్డ్‌ మ్యారేజ్‌ బెటరా..? 4 రియ‌ల్ స్టోరీలు.   Which Is Better, An Arranged Marriage Or A Love Marriage     2018-10-25   08:11:39  IST  Raghu: Raghu

ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందా.. లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందా.. అంటే అది ఎవరి ఇష్టం వారిది. ఒకరికి ఒక తరహా పెళ్లి నచ్చితే, మరొకరికి మరొక తరహా పెళ్లి నచ్చుతుంది. అయితే ఈ విషయంలో స్పష్టత రావాలంటే కింద నాలుగు రియల్‌ స్టోరీలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్టోరీ-1
సునిత (పేరు మార్చాం) బాగా చదువుకుంది. మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ విషయం తెలుసుకున్న ఆమె తాను ఒకర్ని ప్రేమించానని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వద్దన్నారు. ఆమె కుదరదు.. నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులను కాదని వెళ్లిపోయింది. ప్రేమించిన ప్రియున్ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్నాకే తెలిసింది..తాను ప్రేమించిన అతనికి డిప్రెషన్‌ ఉందని, అతను సైకో అని, మందులు వాడుతున్నాడని . దీంతో ఆమె 6 నెలల పాటు ఉన్నాక తన భర్తకు విడాకులిచ్చి ఇంటికి తిరిగొచ్చింది. చివరకు తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకుని హ్యాపీగా ఉంటోంది.

స్టోరీ-2
జార్ఖండ్‌కు చెందిన ఓ యువకుడు, కర్ణాటకకు చెందిన ఓ యువతి ఇద్దరూ 4-5 ఏళ్ల పాటు బాగా ప్రేమించుకున్నారు. తమ తల్లిదండ్రులను ఒప్పించడానికి వారికి చాలా సమయం పట్టింది. చివరకు ఎలాగో కథ సుఖాంతం అయింది. వారు హ్యాపీగా పెళ్లి చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. ఇప్పుడు వారి లైఫ్‌ హ్యాపీగా సాగుతోంది.

Which Is Better  An Arranged Marriage Or A Love Marriage-

స్టోరీ-3
తల్లిదండ్రులకు అతను ఒక్కడే కొడుకు. చిన్నప్పటి నుంచి అతన్ని గారాబంగా పెంచారు. ఆ యువకుడు డీసెంట్‌గా ఉంటాడు. మంచి అలవాట్లు, మృదు స్వభావం ఉన్న వ్యక్తి. అయితే అతను లావుగా ఉంటాడు. దీంతో అతనికి పెళ్లి చేసేందుకు ఆ తల్లిదండ్రులకు చాలా కాలం పట్టింది. అయితే అతను చక్కగా చదువుకున్నాడు కనుక, చివరకు ఎలాగో ఓ అందమైన యువతితో పెళ్లి అయింది. వారు కొన్ని రోజులు కాపురం కూడా చేశారు. అయితే వారికి ఏమైందో తెలియదు కానీ.. పెళ్లయిన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. వారు విడాకులు తీసుకున్న కారణాలు కూడా తెలియవు.

Which Is Better  An Arranged Marriage Or A Love Marriage-

స్టోరీ-4
ఆ యువతి బాగా నల్లగా, లావుగా ఉంటుంది. అయినప్పటికీ చక్కగా చదువుకుంది. మంచి ఉద్యోగం చేస్తుంది. కానీ ఆమె స్కిన్‌ కలర్‌, లావుగా ఉండడం వల్ల ఆమె తల్లిదండ్రులకు ఆమెకు సంబంధం చూడడం కష్టమైంది. అయితే చివరకు ఓ యువకుడితో ఆమెకు పెళ్లి సెట్‌ అయింది. ఆ యువకుడు బాగా ఎత్తు ఉంటాడు. మంచి కలర్‌. షాక్‌ ఏంటంటే.. ఆ యువకుడికి ఆమె బాగా నచ్చింది. దీంతో వెంటనే పెళ్లి ఓకే అన్నాడు. త్వరలో వారు వివాహం చేసుకోనున్నారు. ఇది వారి పెద్దలు కుదిర్చిన మ్యారేజ్‌. వారు జీవితాంతం కలసే ఉంటారని మనకు ఇట్టే తెలిసిపోతుంది.

Which Is Better  An Arranged Marriage Or A Love Marriage-

ఇక చివరిగా విషయాన్ని ముగిస్తే.. 1, 2 కథల్లో దంపతులది లవ్‌ మ్యారేజ్‌. అందులో ఒకరిది సక్సెస్‌ అయితే మరొకరి మ్యారేజ్‌ ఫెయిల్‌ అయింది. ఇక 3, 4 కథల్లో దంపతులది అరేంజ్డ్‌ మ్యారేజ్‌. వాటిల్లో కూడా ఒకటి సక్సెస్ అయితే మరొక మ్యారేజ్‌ ఫెయిల్‌ అయింది. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే… లవ్‌ మ్యారేజెస్‌, అరేంజ్డ్‌ మ్యారేజెస్‌.. ఏ మ్యారేజెస్‌ అయినా.. సక్సెస్‌ అవుతాయని, ఫెయిల్‌ అవుతాయని చెప్పలేం. ఎందుకంటే అది దంపతుల వివాహ జీవితంపై ఆధారపడి ఉంటుంది. అయితే కొందరికి లవ్‌ మ్యారేజ్‌ సక్సెస్‌ అవుతుంది. కొందరికి అరేంజ్డ్‌ మ్యారేజ్‌ సక్సెస్‌ అవుతుంది. కనుక ఎవరైనా లవ్‌లో ఫెయిల్‌ అయితే నిరాశ పడకండి. మీకై పుట్టిన మీ జీవిత భాగస్వామి, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీకు అరేంజ్డ్‌ మ్యారేజ్‌ ద్వారా లభించవచ్చు. కనుక ఆ దిశగా కూడా మీరు ప్రయత్నం చేయండి. లవ్‌లో ఫెయిల్‌ అయ్యామని బాధపడకండి..!