మీరు స్మోక్ చేస్తారా..అయితే ఖ‌చ్చితంగా ఇవి మీ డైట్‌లో ఉండాల్సిందే!

స్మోకింగ్ లేదా పొగ తాగ‌డం‌.నేటి కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి కామ‌న్‌గా ఉన్న అల‌వాటు ఇది.కొన్ని చోట్ల ఆడ‌వారు సైతం స్మోక్ చేస్తుంటారు.పొగ తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసినా.

 Which Food Is Good For Smokers-TeluguStop.com

పొగ తాగ‌డం మానేయండి, లేకుంటే పోతారు అని చెబుతున్నా.ప‌ట్టించుకునే వారే లేరు.

టెన్ష‌న్, ఒత్తిడి త‌గ్గించుకునేందుకు కొంద‌రు స్మోక్ చేస్తే.కొంద‌రు ఫ్యాష‌న్‌ కోసం చేస్తున్నారు.

 Which Food Is Good For Smokers-మీరు స్మోక్ చేస్తారా..అయితే ఖ‌చ్చితంగా ఇవి మీ డైట్‌లో ఉండాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎలా చేసినా.ఆరోగ్యానికి హాని త‌ప్పా ఒరిగేది ఏమీ ఉండ‌దు.

స్మోకింగ్ చేయ‌డం వ‌ల్ల‌.లంగ్స్ మాత్ర‌మే కాదు గుండె, మెద‌డు ఇలా అన్ని అవ‌య‌వాల‌పై ప్ర‌భావం ప‌డుతుంది.చివ‌ర‌కు ప్రాణాల‌నే హ‌రిస్తుంది.పోని ఆ చెడ్డ అల‌వాటుకు దూరంగా ఉండాల‌నుకున్నా ఉండ‌లేరు.

అయితే స్మోకింగ్ చేసినా ఆ ప్ర‌భావం ఆరోగ్యంపై ప‌డ‌కుండా ఎంతో కొంత ర‌క్షించుకోవాల‌నుకుంటే ఖ‌చ్చితంగా కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.వాటిలో మొద‌టిది బ్రోకోలి.

త‌ర‌చూ బ్రోకోలి తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే ప‌లు పోష‌కాలు స్మోకింగ్ వల్ల శరీరంలో చేరే నికోటిన్ మ‌రియు ఇతర కలుషితాలను బ‌య‌ట‌కు పంపిస్తుంది.

అందువ‌ల్ల బ్రోకోలిని సలాడ్, సూప్స్ లేదా కూర రూపంలో అయినా తీసుకోవాలి.

Telugu Braccoli, Capsicum, Garlic, Good Food, Good Health, Health, Health Tips, Latest News, Smokers, Smoking, Smoking Effects-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే ఎన్నో పోష‌క విలువ‌లు ఉండే వెల్లుల్లి కూడా స్మోకింగ్ చేసే వారి ఆరోగ్యాన్ని కాపాడ‌టంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.వెల్లుల్లిని డైలీ డేట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లోని నికోటిన్‌ను మ‌రియు ర‌క్తంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తుంది.విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు ఉండే దానిమ్మను కూడా స్మోకింగ్ చేసే వారు ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

దానిమ్మ కూడా నికోటిన్ కంటెంట్‌ను బ‌య‌ట‌కు పంపి.రక్త కణాలను పెంచుతుంది.

ఇక ధూమపాన ప్రియుల‌ను ర‌క్షించ‌డంలో క్యాప్సిక‌మ్ కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.క్యాప్సిక‌మ్ తీసుకోవ‌డం వ‌ల్ల లంగ్ క్యాన్సర్ ను మరియు ఇతర లంగ్ ఇన్ఫెక్షన్స్ కు దూరంగా ఉండొవ‌చ్చు.

వీటితో పాటుగా క్యారెట్‌, పాల‌కూర‌, గ్రీన్ టీ, యాపిల్‌, కివి పండు, ఆప్రికాట్, ద్రాక్ష‌, పైనాపిల్‌, బీన్స్, ఉల్లిపాయలు, ప‌సుపు వంటి కూడా త‌ర‌చూ తీసుకోవాలి.

#Smokers #Braccoli #Tips #Effects #Garlic

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు