ప్రపంచం మొత్తం దేశాలలో అత్యధిక శక్తివంతమైన పాస్ పోర్ట్ ఏ దేశానికి ఉందంటే..?!  

2021వ సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్ సంస్థ.ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా “వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్” జాబితాను విడుదల చేసింది.

TeluguStop.com - Which Country Has The Most Powerful Passport In The World

వీసా లేకుండానే విదేశాలకు వెళ్లగలిగేందుకు పాస్‌పోర్ట్‌ వినియోగించవచ్చు.అయితే కొన్ని దేశాలు.

వీసా లేకపోయినా పాస్‌పోర్ట్‌ తో తమ దేశం లోకి ఎంట్రీ ఇచ్చిన విదేశీయులను అనుమతిస్తుంది.కానీ కొన్ని దేశాలు మాత్రం తమ గడ్డపై అడుగు పెట్టేందుకు ముందస్తుగానే వీసా తీసుకోవాల్సిందిగా విదేశీయులకు నిబంధనలు పెడుతుంది.

TeluguStop.com - ప్రపంచం మొత్తం దేశాలలో అత్యధిక శక్తివంతమైన పాస్ పోర్ట్ ఏ దేశానికి ఉందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

అందుకే విదేశీ ప్రయాణానికి రెడీ అయిన వారు ముందస్తుగా డబ్బులు కట్టి మరీ వీసా కి అప్లై చేస్తుంటారు.అయితే ఏ దేశం పాస్‌పోర్ట్‌ తో వీసా లేకుండానే ఎక్కువ దేశాల్లో అడుగు పెట్టగలమో ఆ దేశం యొక్క పాస్‌పోర్ట్‌ ని పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ అని అంటారు.

ఐతే ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లను ఏ దేశాలు కలిగి ఉన్నాయో హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్ ప్రకారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1.జపాన్ దేశం పాస్ పోర్ట్ తో 191 దేశాలలో తిరగొచ్చు.అందుకే జపాన్ దేశం శక్తివంతమైన పాస్‌పోర్ట్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తోంది.నిజానికి 3 ఏళ్లుగా జపాన్ దేశమే నెంబర్వన్ స్థానంలో నిలుస్తోంది.

2.సింగపూర్ దేశం పాస్ పోర్ట్ తో 190 దేశాలలో తిరగొచ్చు.

3.జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్ పోర్ట్ లతో 189 దేశాలలో తిరగొచ్చు.

4.ఫిన్లాండ్, లగ్జెంబర్గ్, స్పెయిన్ దేశాల పాస్ పోర్ట్ లతో 188 దేశాలలో వీసా లేకుండానే ల్యాండ్ అవ్వొచ్చు.

5.ఆస్ట్రియా, డెన్మార్క్ దేశాల పాస్ పోర్ట్ లతో 187 దేశాలలో వీసా లేకుండానే అడుగుపెట్టొచ్చు.

6.ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్ దేశాల పాస్ పోర్ట్ లతో 186 దేశాలు విజిట్ చేయొచ్చు.

7.బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికా – 185

8.ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా – 184

9.కెనడా – 183

10.హంగేరి – 182

అయితే మన భారతదేశం “వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్” జాబితాలో 85వ స్థానంతో సరిపెట్టుకుంది.కిందటేడాది 84 వ స్థానంలో నిలిచిన భారతదేశం ఇప్పుడు 85వ స్థానానికి పడిపోయింది.అయితే భారతదేశం పాస్‌పోర్ట్ 58 స్కోరు సాధించింది.

అంటే ఇండియన్ పాస్‌పోర్ట్ తో ముందస్తు వీసా లేకుండానే 58 దేశాలకు వెళ్లొచ్చు.ఇకపోతే ఆఫ్గనిస్థాన్ దేశం కేవలం 26 పాస్‌పోర్ట్ స్కోరుతో అత్యల్ప స్థానం లో నిలిచింది.

#Social Media #Viral Post #Pass Port #World Wide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Which Country Has The Most Powerful Passport In The World Related Telugu News,Photos/Pics,Images..