మెగా డాటర్ నిహారిక నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది.అయితే ఈ యాక్టింగ్ మన వల్ల కాదని నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి నిర్మాతగా సెటిల్ అవుతుంది.
రీసెంట్ గా ఆమె నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సీరీస్ జీ 5లో రిలీజైంది.ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ తో పాటుగా నిహారిక స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది.
ఓ ప్రముఖ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మెగాస్టార్ తీసిన 151 సినిమాల్లో తనకు నచ్చిన సినిమా ఏదో చెప్పేసింది.
పెదనాన్న చేసిన అన్ని సినిమాలు తనకు ఇష్టమని చెప్పిన నిహారిక ఎక్కువగా చూసింది మాత్రం బావగారు బాగున్నారా అని చెప్పింది.ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదని చెప్పింది.అంతేకాదు రుద్రవీణ సినిమా కూడా ఎక్కువసార్లు చూశానని అన్నది.
ఇక పవన్ కళ్యాణ్ బాబాయ్ నటించిన గుడుంబా శంకర్ సినిమా తనకు ఇష్టమని ఆ సినిమా బాగా చూశానని చెప్పింది నిహారిక.ఛాన్స్ దొరికితే తన ప్రొడక్షన్ లో బాబాయ్ పవన్ తో సినిమా చేస్తానని చెప్పింది నిహారిక.
తన సినిమాల పట్ల తన నిర్ణయమే ఫైనల్ అని ఎవరు తన సినిమాల విషయంలో జోక్యం చేసుకోరని చెప్పింది నిహారిక.