పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్?

Which Bigg Boss Contestant Got The Opportunity To Act In A Pan India Film

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి సినీ నటి ప్రియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Which Bigg Boss Contestant Got The Opportunity To Act In A Pan India Film-TeluguStop.com

ఈమె ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె ఏడవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు.

 Which Bigg Boss Contestant Got The Opportunity To Act In A Pan India Film-పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె భారీ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోని ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నటువంటి పాన్ ఇండియా చిత్రంలో ప్రియా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.ఇకపోతే ఈమె ఇదివరకే ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించి విశేష ఆదరణ దక్కించుకుంది.ఈ క్రమంలోనే ఈమెకు మరోసారి ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇదే కాకుండా ఈమె సినిమాల్లో  మరోసారి  నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నట్లు సమాచారం.

#Priya #Pan India #Big Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube