మిషన్ కాకతీయ పథకానికి ఇక కాలం చెల్లినట్టేనా?

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో మిషన్ కాకతీయ పథకం ఒకటి.విడతల వారీగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

 Whether The Mission Kakatiya Scheme Is Long-TeluguStop.com

తెలంగాణలో నీటివనరుల సాంద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది.ఈ పథకం ద్వారా ఎన్నో చెరువులకు పునరుజ్జీవం వచ్చింది.

కాని ఈ పథకాన్ని మొదట్లో కొనసాగించినంత వేగంగా ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించడం లేదు.రెండు, మూడు విడతల్లో చేయగా ఇంకా చాలా చెరువులు పునరుద్దరణకు నోచుకోని పరిస్థితి.

 Whether The Mission Kakatiya Scheme Is Long-మిషన్ కాకతీయ పథకానికి ఇక కాలం చెల్లినట్టేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం, ఆ పథకం అమలు దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్న చర్యలు ఏవీ లేకపోవడంతో ఈ పథకం అమలుకు నోచుకుంటుందా లేదా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది.ఎందుకంటే ఈ పథకం వల్ల చెరువులకు పునరుజ్జీవనం రావడం, ఆ పూడికతీత మట్టితో రైతులు తమ పొలాలలో చల్లుకోవడం వల్ల భూమి నాణ్యత పెరగడం ఇలా చాలా ఉపయోగాలు కలిగే పథకంపై నీలినీడలు కమ్ముకోవడంతో ఇక ఈ పథకానికి కాలం చెల్లినట్టేనని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

చూద్దాం ప్రభుత్వం ఈ పథకం అమలు నిలిపివేతపై స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

#@JaiKCR29 #Mishan Kakatiya #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు