టెక్నాలజీ: ఆ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కు ఛార్జింగే అవసరం లేదట..!

కమ్యూనికేషన్ హెడ్ సెట్లను అందించే బ్లూటూత్ కంపెనీ బ్లూ టైగర్ యూఎస్ఏ అనే కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ హెడ్ సెట్‌ను ప్రకటించింది.దీని పేరు బ్లూ టైగర్ సోలారే హెడ్ సెట్‌ గా నిర్ణయించారు.

 Whether Or Not Those Bluetooth Headphones Need Charging.  Blue Tooth , Head Phon-TeluguStop.com

సీఈఎస్ 2022లో లాంచ్ కానున్నాయి.జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు లాస్ వెగాస్‌ లో ఈ కార్యక్రమం జరగనుంది.

ప్రీ-ఆర్డర్లు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి.షిప్పింగ్ ఏప్రిల్‌ లో ప్రారంభం కానుంది.కంపెనీ వెబ్ సైట్లో ధరను 199.99 డాలర్లుగా నిర్ణయించారు.మనదేశ కరెన్సీలో దాదాపు రూ.15 వేల వరకు ఉంటుంది.కంపెనీ ప్రకారంగా చూస్తే ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ పవర్డ్ కమ్యూనికేషన్ హెడ్ సెట్ ఇదే.ఇంట్లో, ఆఫీస్‌ లో వీటిని ఉపయోగించవచ్చు.ఇండోర్, అవుట్‌ డోర్ ఎక్కడనుంచైనా ఇది కాంతిని తీసుకుని పని చేస్తూనే ఉంటుంది.బ్యాటరీని రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.-40 డిగ్రీల ఫారన్ హీట్ నుంచి 122 డిగ్రీల ఫారన్ హీట్ టెంపరేచర్ మధ్య పనిచేయనుంది.

మిలటరీ గ్రేడ్ బ్లూటూత్ హెడ్ సెట్ ఉపయోగించే సోలార్ టెక్నాలజీకి పేటెంట్ కూడా తీసుకున్నారు.

ప్రత్యేకమైన నానో మెటీరియల్ ద్వారా ఈ టెక్నాలజీని రూపొందించారు.దీని ద్వారా ఇండోర్‌ లో, అవుట్ డోర్‌లో అయినా సాధారణ కాంతిని, కృత్రిమ కాంతిని అయినా ఇది శక్తిగా మార్చి బ్యాటరీని రీచార్జ్ చేస్తుంది.

Telugu Blue Tooth, Solar-Latest News - Telugu

ఇందులో 97 శాతం నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కూడా ఉంది.హై క్వాలిటీ స్పీకర్ కాంపోనెంట్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉంది అనే విషయం ఆలోచించకుండా ఉపయోగించేందుకు సాయపడుతుంది.సోలార్ సెల్ టెక్నాలజీ వేర్వేరు కోణాల నుంచి కాంతిని తీసుకోగలదు.ఇండోర్, అవుట్‌డోర్ లైట్ నుంచి ఇది సమానంగా పనిచేస్తుంది.సిరి, గూగుల్ అసిస్టెంట్‌ లను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో ఈ హెడ్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube