సమంతకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదా.. ఫోర్స్ తో అలా అయ్యిందా?

Whether Or Not Samantha Would Like A Divorce

ఇటీవలే సమంత,నాగ చైతన్య వారి నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.ఈ విషయం కొద్ది రోజుల కిందటి వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 Whether Or Not Samantha Would Like A Divorce-TeluguStop.com

ఇప్పటికీ వీరు విడాకులు తీసుకొని నెల రోజులు దాటిన కూడా వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.అలాగే విడాకుల తరువాత సమంత సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టినా కూడా అది వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పిలవబడే ఈ జంట సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజం చేస్తూ విడాకులు తీసుకోవడంతో వారి అభిమానులు షాక్ కు గురయ్యారు.ఇక విడాకులు తీసుకున్న తరువాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.

 Whether Or Not Samantha Would Like A Divorce-సమంతకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదా.. ఫోర్స్ తో అలా అయ్యిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్, టాలీవుడ్, తో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Divorce, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

ఇక విడాకుల తర్వాత సమంత రోజూ ఏదో ఒక కొటేషన్ ను ఇన్​స్టాగ్రామ్ స్టోరీలో పెడుతోంది.ఈ క్రమంలోనే సమంత తాజాగా ఇన్​స్టాగ్రామ్ లో కొన్ని స్టోరీస్ లు పెట్టింది.వాటిలోనే మీరు గట్టి పోరాటం చేసి ఓడిపోతారు.కొన్నిసార్లు మీరు చాలా గట్టి పోరాటం చేసిన, వదిలేసేది, అంటూ మరో కొటేషన్ ను షేర్ చేసింది.ఈ కొటేషన్ లపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.అసలు సమంతకి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

విడాకులు తీసుకోకపోవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేసింది కానీ విడాకులు తీసుకోక తప్పలేదు అంటున్నారు సమంత అభిమానులు.

#Samantha #Naga Chaitanya #Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube