శ్రీరాముని చే ఆవిష్కరించబడిన రంగనాథ ఆలయం ఎక్కడుందో తెలుసా..?

మన దక్షిణ భారత దేశంలో అత్యంత పురాతనమైన వైష్ణవాలయాలలో శ్రీరంగనాథ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.ఈ రంగనాథ ఆలయం సుమారు 156 ఎకరాలలో విస్తరించి ఉండి భారత దేశంలోనే అత్యంత పెద్దదైన వైష్ణవాలయంగా పేరుగాంచింది.

 Where The Largest Temple In India Is Located-TeluguStop.com

ఆ విష్ణు భగవానుడికి ఎంతో ప్రీతికరమైన 108 వైష్ణవాలయాలలో ఈ ఆలయం ఒకటి.ఇంత పెద్దదైన, పేరుప్రఖ్యాతులు గాంచిన వైష్ణవాలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో శ్రీరంగం అనే గ్రామంలో కొలువై ఉంది.

ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ విశేషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

 Where The Largest Temple In India Is Located-శ్రీరాముని చే ఆవిష్కరించబడిన రంగనాథ ఆలయం ఎక్కడుందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పురాణాల ప్రకారం ఈ ఆలయం వేల సంవత్సరాల కాలం నాటి నాగరికతను తెలియజేస్తుంది.

రామాయణం ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసం చేసిన సమయంలో సీతాదేవి అపహరణ జరుగుతుంది.అనంతరం సీత జాడ కనుకున్న శ్రీ రాముడు రావణాసురుడుతో యుద్ధం చేసి తిరిగి సీతను తీసుకుని అయోధ్యకు చేరుకుంటాడు.

ఈ క్రమంలో రావణాసురుడి తమ్ముడు విభీషణుడు శ్రీరామచంద్రునికి ఎంతో సహాయపడతాడు.ఈ విధంగా అయోధ్యకు వచ్చి తిరిగి పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రుడిని వదిలి విభీషణుడు లంకకు వెళ్ళడానికి ఎంతో బాధపడతాడు.

ఆ సమయంలో శ్రీరామచంద్రుడు విభీషణుడికి శ్రీరంగనాథుని దివ్య మూర్తి ఇచ్చి తాను ఎప్పుడు నీ వెంటే ఉంటానని చెబుతాడు.

శ్రీరామచంద్రుడు ఇచ్చిన శ్రీరంగనాథుని తీసుకొని లంకకు బయలుదేరుతున్న సమయంలో మార్గమధ్యలోనే సంధ్యా సమయం కావడంతో విభీషణుడు ఆ విగ్రహాన్ని కావేరీ నది ప్రాంతంలో సంధ్య కార్యక్రమాలను ఆచరించి తిరిగి వచ్చే సమయానికి రంగనాథుడు ప్రణవాకార, విమాన రూపంలో ప్రతిష్టం అవుతాడు.అది చూసి ఎంతో విచారిస్తున్న విభీషణుడికి సాక్షాత్తూ ఆ శ్రీ రంగనాథుడు ప్రత్యక్షమై ప్రతిరోజు సాయంత్రం సమయంలో నీ పూజలు అందుకుంటానని వరమిస్తాడు.ఈ విధంగా ఆ గ్రామంలో రంగనాథ ఆలయం శ్రీరాముడి చేత ఆవిష్కరించబడిన ఆలయంగా భావిస్తారు.

#Tamil Nadu #Vibheeshanudu #Tiruchapalli #Lord Rama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU