ఆ దేశంలో పాలు తాగడానికి బార్లకు వెళ్తారట..నమ్మడం లేదా..!

మాములుగా మన దగ్గర బార్ లు అంటే మద్యం మాత్రమే అమ్ముతారు.బార్ కు వెళ్తున్నారంటే ఖచ్చితంగా మద్యం జీవించడానికే అయి ఉంటుంది.

 Where People Go To Bars To Drink Milk Details, Rwandan, People, Milk Bars, Drink-TeluguStop.com

ఆఫ్రికాలోని ర్వాండా దేశ రాజధాని కిగాలిలో కూడా జనాలు బార్ లకు వెళ్తారు.మన దగ్గర లాగానే అక్కడ కూడా రద్దీగా నే ఉంటాయి.

కానీ మన దగ్గర అమ్మినట్టు అక్కడ బార్ లలో మద్యం అమ్మడం లేదు.అక్కడి ప్రజలు మద్యం కొనడానికి బార్లకు వెళ్లడం లేదు.

నమ్మడం లేదా.అయితే పూర్తిగా తెలుసుకోండి.ఇక్కడి ప్రజలు రోజు బార్లకు వెళ్లి పాలు తాగుతారు.నిజమండి బాబు నమ్మాలి.

ఎందుకంటే ఇదే నిజం.ఇది వారి సంప్రదాయం అని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

వాళ్ళు తెలిపిన దాని ప్రకారం.ఆఫ్రికాలోని ర్వాండా దేశ ప్రజలు ప్రతి రోజు అక్కడి బార్లకు వెళ్లి పాలు తాగి వస్తారు.

ఆడవాళ్లు, మగవాళ్ళు కలిపి కూర్చుని తాగుతారు.

అక్కడ బార్లలో పాలు తాగేందుకు వచ్చే ప్రజలు ఏమని చెబుతున్నారో తెలుసా.

ఒక డ్రైవర్ చెబుతూ ప్రశాంతంగా ఉండేందుకు పాలు తాగుతానని.పాలు తాగితే ఒత్తిడి కూడా తగ్గుతుందని తెలిపాడు.

చాలా మంది ప్రజలు ఇలాంటి కారణాలే చెబుతున్నారు.ఇక్కడ పాలు ఎంతో పాపులర్ డ్రింక్ అట.ఇక్కడి బార్లలో చల్లటి పాలతో పాటు వేడి పాలు కూడా సర్వ్ చేస్తారట.

Telugu Africa, Cows, Milk, Bar Milk, Mal, Milk Bars, Ruanda, Rwanda, Rwandan, Ba

అంతేకాదు ఇక్కడి ప్రజలు కేక్ లు, అరటి పండ్లు, బ్రెడ్ ఎక్కువుగా తినడానికి ఇష్టపడతారట.ఇక్కడ ఆర్ధిక వ్యవస్థలో పాలు కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయట.ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ఆవుల వల్ల వచ్చే పాలను అమ్ముకుని జీవిస్తారట.ఇది వారి దేశ సంప్రదాయం అని కూడా వారు చెబుతున్నారు.1994లో జరిగిన మారణకాండలో 8 లక్షల మంది చనిపోయారట.

Telugu Africa, Cows, Milk, Bar Milk, Mal, Milk Bars, Ruanda, Rwanda, Rwandan, Ba

అయితే ఆ దేశం ఇప్పుడిప్పుడే ఆ మారణకాండ నుండి కోలుకుని మళ్ళీ ఆవులను పెంచుతూ పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు ఆర్ధికంగా కూడా బలపడేందుకు అక్కడి ప్రభుత్వం కృషి చేస్తుంది.అక్కడి పేద ప్రజలకు గిరింకా అనే కార్యక్రమం ద్వారా ఒక్కో ఆవును ఇచ్చారు.ఇప్పటికి 3 లక్షల 80 వేల ఆవులను ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.మన దేశం తరపున మోడీ కూడా 200 ఆవులను ఆ దేశానికీ ఇచ్చారు.ఇది అక్కడి బార్ ల కథ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube