ఏపీలో వెంక‌య్య వ‌ర్గం అడ్ర‌స్ ఎక్క‌డ‌... ఈ నాయ‌కులు ఏమ‌య్యారు...!

ప్ర‌స్తుత ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు గ‌త నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డంతో ఆయ‌న‌కు ఎంతో అనుచ‌ర‌గ‌ణం ఉంది.ఆయ‌న అనుచ‌రులు నేడు దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీల్లో ఉన్నారు.

 Where Is Venkaiah Naidu Batch Leaders Addres In Ap..?, Bjp, Amithshah, Vice Pres-TeluguStop.com

పార్టీల‌తో సంబంధం లేకుండా వెంక‌య్య నాయుడుకు అనుచ‌ర‌గ‌ణం ఉంది.సౌత్‌లో బీజేపీకి కీల‌క నేత‌గా ఉన్న వెంక‌య్య 2014లో బీజేపీ గెలిచాక కేంద్ర మంత్రి అవ్వ‌డంతో పాటు సౌత్‌లో పార్టీ ప‌రంగా కీల‌కంగా చ‌క్రం తిప్పారు.

ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీ నేత‌గా ఉంటే సౌత్‌లోనే కాకుండా… ఏపీలో పార్టీ ఎద‌గ‌డం లేద‌ని భావించే మోడీ, అమిత్ షా ఆయ‌న్ను ఉప రాష్ట్ర‌ప‌తిని చేసి వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్టారు.

ఆయ‌న కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు బీజేపీలోనే కాకుండా.

టీడీపీలో ఉన్న వారిలో కూడా ప‌లువురు నేత‌లు ఆయ‌న వ‌ర్గంగా చ‌క్రం తిప్పారు.వీరిలో మాజీ ఎంపీలు కంభంపాటి హ‌రిబాబు, గోక‌రాజు గంగ‌రాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు పి.స‌న్యాసి రాజు, సుజ‌నా చౌద‌రి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేత‌లు ఆయ‌న కంట్రోల్ ఉండేవారు.క‌న్నా ల‌క్షీనారాయ‌ణ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు కూడా వారంతా యాక్టివ్‌గానే ఉన్నారు.

ఎప్పుడు అయితే సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్ అయ్యారో అప్ప‌టి నుంచి అస‌లు వెంక‌య్య వ‌ర్గం ఉందా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వెంక‌య్య వ‌ర్గం ఎప్పుడూ టీడీపీకి అనుకూల‌మే.

అయితే ఇప్పుడు వీరంతా ప్ర‌తిప‌క్ష వైసీపీపై కూడా ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు.వీరిలో హ‌రిబాబు లాంటి వాళ్ల‌కు రాజ్య‌స‌భ వ‌స్తుంద‌న్న ప్ర‌చారం జ‌రిగినా వాళ్ల‌ను కేంద్రం అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇక వెంక‌య్య వ‌ర్గం స్పీడ్‌గా ఉంటే త‌న స్వేచ్ఛ‌కు అడ్డు వ‌స్తార‌ని సోము జాతీయ నాయ‌క‌త్వానికి చెప్ప‌డంతో వీరిని సైలెంట్ చేయించార‌న్న టాక్ అయితే ఉంది.ఏదేమైనా ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన వెంక‌య్య వ‌ర్గం ఇప్పుడు సైలెంట్‌గా ఉండ‌డంపై పార్టీలోనే పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube