ఇది ఎక్కడి గోల రా బాబు.. శవాన్ని ఏకంగా బ్యాంక్‌‌కు తీసుకొచ్చారు..!

ప్రస్తుత రోజుల్లో మనిషి కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సమాజంలో మనం జీవిస్తున్నాం.డబ్బు సంపాదనలో పడి బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా మరిచిపోయ జీవితాన్ని కొనసాగిస్తున్న సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం.

 Where Is This Gola Ra Babu The Corpse Was Brought To The Bank , Dead Body, Bihar-TeluguStop.com

ఇకపోతే ఈ సంఘటన వినడానికి చాలా విడ్డూరంగా ఉన్నా కానీ ఇది చోటు చేసుకుంది.సాధారణంగా శవాన్ని స్మశానానికి తీసుకుని వెళతారు కానీ.

ఆ ఊరి గ్రామస్థులు శవాన్ని బ్యాంకుకు తీసుకొనివెళ్ళారు.అదేంటి శవాన్ని బ్యాంకుకు తీసుకు వెళ్లడం అని అనుకుంటున్నారా.? అవును ఇది నిజం.ఇంతకీ ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా.?!

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.బీహార్లోని పాట్నాకు సమీపంలో ఉన్న సిగరియావా గ్రామంలో మహేష్ అనే వ్యక్తి మృతి చెందారు.

ఇక అతడికి ఎవరు సొంత వాళ్ళు లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించేవాడు.కూలి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులు అన్నీ ప్రముఖ కెనరా బ్యాంకులో దాచుకుంటా జీవితాన్ని కొనసాగించేవారు.

ఇటీవల కాలంలో మహేష్ కాస్త అనారోగ్యానికి గురికావడంతో తన సన్నిహితులతో బ్యాంకులో ఇలా దాచిపెట్టిన డబ్బుల గురించి తెలియచేశాడు.ఆ డబ్బుతోనే తాను వైద్యం చేయించుకుంటానని తెలియజేశాడు.

అయితే ఆ డబ్బులు తిరిగి బ్యాంకు నుంచి తీసుకోకముందే మహేష్ మృతి చెందారు.మహేష్ కు బంధువులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు.

గ్రామస్థులు అందరు కూడా మహేష్ దాచుకున్న డబ్బుతోనే ఘనంగా అంతిమ వీడ్కోలు తెలపాలని మహేష్ బ్యాంకు పాస్ బుక్ తీసుకొని కెనరా బ్యాంకు కు వెళ్లారు.దీంతో బ్యాంక్ సిబ్బందిని మహేష్ చనిపోయాడు అతను దాచుకున్న డబ్బుతో అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు అడగగా బ్యాంకు సిబ్బంది అందుకు ఓకే చెప్పలేదు.

అంతేకాకుండా అలా ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంక్ మేనేజర్ బ్యాంకు రూల్స్ గురించి చెప్పేందుకు ప్రయత్నం చేశారు.

Telugu Bank Manager, Bihar, Patna-General-Telugu

అంతేకాకుండా మహేష్ కి నామినిగా కూడా ఎవరూ లేరు కనుక అతడే స్వయంగా వచ్చి డబ్బులు తీసుకోవాలని బ్యాంకు మేనేజర్ గ్రామస్తులతో తెలిపాడు.దీంతో గ్రామస్తులు మహేష్ చనిపోయాడు ఎలా వస్తాడు అని ప్రశ్నించారు.? అందుకు సమాధానంగా బ్యాంక్ మేనేజర్ అతడి డబ్బును ఇతరులకు ఎవరికి కూడా ఇవ్వడం సాధ్యం కాదని తెలియజేయడంతో గ్రామస్తులు అందరూ కొంత సమయం తర్వాత మహేష్ డెడ్ బాడీని స్మశానానికి తీసుకు వెళ్ళకుండా బ్యాంకు కు తీసుకొని వచ్చారు.అప్పుడు మహేష్ వచ్చాడు ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా లేదా అని గ్రామస్తులు మేనేజర్ ను అడగగా ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.వెంటనే పదివేల రూపాయలు తన జేబులోంచి తీసి ఇచ్చి గ్రామస్తులకు అందజేయడంతో పాటు మేనేజర్ కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube