శివుడు స్వయంగా తీర్థం ఇచ్చే ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ విశేషాలేమిటో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం తర్వాత పంతులు మనకు హారతి ఇచ్చి తలపై శఠగోపం పెట్టి ఆ తర్వాత తీర్థప్రసాదాలను ఇస్తారు.మనం ఏ ఆలయానికి వెళ్లిన ఇదే తంతు మనకు కనబడుతుంది.

 Shivaganga Temple Where Maha Shiva Gives Thirtha Himself, Lord Shiva, Temple, Ka-TeluguStop.com

మీరు ఎప్పుడైనా దేవుడు తీర్థం ఇవ్వడం చూశారా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.

దేవుడే స్వయంగా తీర్థప్రసాదాలు ఇచ్చే దేవాలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టతలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

కర్ణాటకలో శివగంగ అనే క్షేత్రం ఉంది.ఈ ఆలయంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తీర్థాన్ని ఉత్పన్నం చేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటాడు.

అయితే ఇక్కడ శివుడు ఉత్పన్నం చేసే తీర్థం మనకు అన్ని వేళలా దొరకదు కేవలం మకర సంక్రమణ జరిగిన రోజు మాత్రమే శివుడు ఉత్పన్నం చేసిన ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు.ఈ శివ గంగ క్షేత్రం సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తులో వుంది.

ఈ కొండను తూర్పు నుంచి చూస్తే నంది మాదిరిగా, పడమర నుంచి చూస్తే వినాయకుడిలా, ఉత్తరం నుంచి చూస్తే పాము మాదిరి, దక్షిణం నుంచి చూస్తే లింగాకారంలో కనబడుతుంది.

Telugu Karnataka, Lord Shiva, Mystery Temple, Parameswara, Pooja, Telugu Bhakthi

ఈ విధంగా ఈ కొండపై వెలసిన ఈ ఆలయంలో ఒక రాతి మండపం దానికింద ఒక చిన్నటి తొట్టి ఉంటుంది.ఈ తొట్టిలో ప్రతిరోజు కాకుండా కేవలం మకరసంక్రాంతి రోజు మాత్రమే నీటి ఉద్భవం జరుగుతుంది.వర్షాకాలంలో కాకుండా ఇలా మకరసంక్రాంతి రోజు మాత్రమే ఈ తొట్టిలో నీరు ఉద్భవించడానికి గల కారణం ఏమిటనే విషయం తెలుసుకోవడానికి ఎంతో మంది పరిశోధకులు ప్రయత్నించినప్పటికీ అక్కడ దాగి ఉన్న రహస్యం మాత్రం బయట పడలేదు.

Telugu Karnataka, Lord Shiva, Mystery Temple, Parameswara, Pooja, Telugu Bhakthi

ఈ విధంగా మకర సంక్రాంతి రోజు మాత్రమే తొట్టిలో నీరు ఉద్భవించడం వల్ల దీనిని గంగోత్పత్తి కాలమంటారు. ఆలా ఉద్భవించిన ఆ నీటికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

Telugu Karnataka, Lord Shiva, Mystery Temple, Parameswara, Pooja, Telugu Bhakthi

ఈ విధంగా వచ్చిన నీటిని ఒక స్వర్ణ పాత్రలోకి పట్టి ఆ నీటిలోకి శివగంగ దేవాలయం నీటిని కలిపి అక్కడికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.అయితే ఈ మకర సంక్రాంతి రోజు మాత్రమే ఈ విధంగా నీరు రావడం వల్ల చాలా మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామివారికి ఉద్భవించిన తీర్థప్రసాదాలను తీసుకుంటారు.అయితే ఇలా మీరు ఉద్భవించడానికి గల కారణం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మహిమేనని భక్తులు విశ్వసిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube