ప్రస్తుతం శ్రీముఖి ఎక్కడుందో తెలుసా, సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో రన్నర్‌గా నిలిచిన శ్రీముఖి ప్రస్తుతం ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనే విషయమై సినీ వర్గాల్లో మరియు ఆమె అభిమానుల్లో చర్చ జరుగుతోంది.గత కొన్నాళ్లుగా ఆ అమ్మడు బిగ్‌బాస్‌లో ఉన్న కారణంగా ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుందట.

 Where Is The Sri Muhki Right Now-TeluguStop.com

షూటింగ్స్‌కు మరో రెండు మూడు వారాల వరకు దూరంగా ఉండాలని ఆమె భావిస్తుందట.విన్నర్‌ కాలేక పోయినందుకు నిరుత్సాహంగా లేదంటూ ప్రకటించిన శ్రీముఖి తన మునుపటి స్వభావంతో ఎంజాయ్‌ చేస్తూనే ఉంది.

Telugu Sri Muhki, Sri Mukhi, Telugu Big Boss, Telugu Patas-

ప్రస్తుతం ఈ అమ్మడు స్నేహితులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది.తెలుగు బుల్లి తెరపై తనదైన శైలిలో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఎన్నో మంచి సినిమాల్లో కూడా నటించింది.ఇక బిగ్‌బాస్‌లో ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదని చెప్పుకోవచ్చు.ఖచ్చితంగా శ్రీముఖి విన్నర్‌ అంటూ ఆమె అభిమానులు చాలా నమ్మకం పెంచుకున్నారు.కాని అనూహ్యంగా రాహుల్‌ విజేతగా నిలిచాడు.అది కూడా ఆమె వల్ల అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Sri Muhki, Sri Mukhi, Telugu Big Boss, Telugu Patas-

శ్రీముఖికి ఎంతగానో పేరు తీసుకు వచ్చిన పటాస్‌ షోను ప్రస్తుతం వర్షిణి చేస్తోంది.కనుక ఆమె స్థానంలో మళ్లీ శ్రీముఖి వెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.బిగ్‌బాస్‌ తర్వాత తన కెరీర్‌ మారిపోతుందని శ్రీముఖి భావిస్తుంది.కాని ఎవరికి కూడా ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ వల్ల బిగ్‌ బ్రేక్‌ దొరికింది లేదు.అందుకే శ్రీముఖి కూడా బిగ్‌ బాస్‌ వల్ల పెద్దగా ప్రయోజనం పొందక పోవచ్చు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube