పవిత్రమైన గుడిలో వివాహిత మహిళను రేప్ చేసిన సాధువు.. ఎక్కడంటే?

Where Is The Saint Who Raped A Married Woman In A Holy Temple, Rape, Sadhu, Ramkrishna Kumar, Panchmahal Rural Police, Religious Rituals, Latest News

సాధారణంగా ప్రజలు గుడిని అత్యంత పవిత్రమైన ప్రదేశం గా భావిస్తారు.గుడిలోకి స్నానం చేయకుండా వచ్చేందుకు కూడా భయపడుతుంటారు.

 Where Is The Saint Who Raped A Married Woman In A Holy Temple, Rape, Sadhu, Ramk-TeluguStop.com

అలాంటిది ఒక సాధువు ముసుగులో ఉన్న కామాంధుడు ఏకంగా గుడిలోనే అత్యాచారం చేశాడు.ఇంతటి పాపం చేసిన ఆ దుర్మార్గుడి పేరు రామకృష్ణ కుమార్.

తాజాగా అతడిని పంచమహల్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.కాగా ఈ ఘటన సంచలనాత్మకంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.పెళ్లయ్యి పది సంవత్సరాలు గడుస్తున్నా బాధితురాలు గర్భం దాల్చలేకపోయింది.దాంతో తీవ్ర నిరాశకి గురైన ఆమె దేవుడిపై విశ్వాసంతో టింబి ఆశ్రమంలోని రామ్ టేక్రి ఆలయాన్ని సందర్శిస్తూ పూజలు చేస్తోంది.అక్కడ ఆమెకు కృష్ణకుమార్‌తో పరిచయం ఏర్పడింది.

అతను తన బిడ్డను కనాలనే ఆమె కోరికను నెరవేరుస్తానని హామీ ఇచ్చాడు.శుక్రవారం దాఖలైన ఆమె ఫిర్యాదు ప్రకారం, తాను గర్భం దాల్చడానికి సహాయపడే మతపరమైన ఆచారాలు చేస్తానని కృష్ణకుమార్ నమ్మబలికాడు.

ఆ నెపంతో కృష్ణకుమార్ ఆమెకు పలు సందర్భాల్లో ఫోన్ చేశాడు. అయితే, శుక్రవారం నిందితుడు అదే నెపంతో ఆమెకు మళ్లీ కాల్ చేశాడు.

దాంతో అదే చెప్పినట్లు ఆమె ఒక గుడి వద్దకు వెళ్ళింది.గుడిలోకి రాగానే ఎలాంటి కర్మలు చేయకుండా ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Telugu Latest, Rituals, Sadhu-Latest News - Telugu

ఇది ఒక విషాదకరమైన, భయానక సంఘటన అని స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఒక స్త్రీని మతపరమైన ఆచారాల ముసుగులో అత్యాచారం చేయడం చాలా అన్యాయం అని ఇంకొందరు అంటున్నారు.ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube