800 సంవత్సరాల నాటి అతిపురాతన వాసు దేవాలయం ఎక్కడంటే?

మన భారతదేశం ఎన్నో పురాతన ఆలయాలకు నిలయం.కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా, ఎంతో అందంగా ఉన్నాయి.

 Where Is The 800 Year Old Vasu Temple Located-TeluguStop.com

మన దేశంలోని వివిధప్రాంతాలలో ఉన్న ఈ దేవాలయాలను దర్శించడానికి మనదేశంలోనే కాకుండా, ఇతర దేశాల నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తుంటారు.ఇటువంటి అతి పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా శ్రీ వాసు దేవాలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం విశిష్టత ఏమిటో తెలుసుకుందాం…

శ్రీవాసుదేవపెరుమాళ్ ఆలయం….పెరుమాళ్ ఈ పేరును సాధారణంగా తమిళ భాషలలో ఎక్కువగా వాడుతుంటారు.

 Where Is The 800 Year Old Vasu Temple Located-800 సంవత్సరాల నాటి అతిపురాతన వాసు దేవాలయం ఎక్కడంటే-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటప్పుడు ఈ దేవాలయం తమిళనాడులో ఉంది అనుకుంటే పొరపాటు పడినట్టే .ఇంతటి పురాతన ఆలయం ఆంధ్రప్రదేశ్_ ఒరిస్సా సరిహద్దులో శ్రీకాకుళం జిల్లా కి వంద కిలోమీటర్ల దూరంలో మందస అనే ప్రాంతంలో నిర్మించబడింది.ఈ దేవాలయంలోని పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించే భక్తుల సమస్త పాపాలు తొలగిపోయి, సకల సంతోషాలతో నిండి ఉంటారని ప్రసిద్ధి.

ఈ దేవాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిదని అర్థమవుతుంది.

అయితే 300 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని మందసను పరిపాలించిన మణిదేవమహారాజు వైష్ణవ మతం మీద గౌరవంతో తిరిగి ఆలయాన్ని పునరుద్ధరించారు.ఈ ఆలయంలోనే చిన్న జీయర్ స్వామి గురువైన పెద్ద జీయర్ స్వామి వారు ఇక్కడే శ్రీభాష్యం చదువుకున్నారు.

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ వైష్ణవాలయంను సందర్శిస్తే సమస్త లోకంలో ఉన్న వైష్ణవ ఆలయాలను సందర్శించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.

ఈ ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా పెరుమాళ్ కొలువై ఉన్నారు.ఈ ఆలయం పక్కనే గోపాల సాగర్ జలాశయం ఉంది.ప్రతి సంవత్సరం మాఘ మాసంలో ఈ ఆలయాన్ని భక్తులు పెద్ద ఎత్తున దర్శిస్తుంటారు.

మాఘ మాసం లో జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్ర తీర్థ వేడుకలు ఈ జలాశయం లోనే జరుగుతాయి.ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు.

#800Years #GopalaSagar #Srikakulam #Mundasa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU