టీడీపీలో క‌నిపించ‌ని ఆ సీనియ‌ర్ ఫ్యామిలీ... అడ్ర‌స్ ఎక్క‌డ ?

ఒక్క గెలుపు నాయ‌కుడిని ప్ర‌జ‌ల్లో నిల‌బెడితే అదే ఓ ఓట‌మి నాయ‌కుడి ఆత్మ‌స్థ‌యిర్యాన్ని ప్ర‌శ్నార్థకం చేస్తుంద‌ని అంటారు ప‌రిశీల‌కులు.ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌.

 Where Is That Unknown Tdp Leader Family Address In Tdp?,ap,ap Political News,pol-TeluguStop.com

క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి, కోట్ల సుజాత‌మ్మ‌ల‌కు ఎదుర‌వుతోంది.రాజ‌కీయాల్లో సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న ఈ కుటుంబం నుంచి కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా చ‌క్రం తిప్పారు.

ఆయ‌న కుమారుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి ఎంపీగా గెలిచారు.సుజాత‌మ్మ‌కూడా చ‌క్రం తిప్పారు.

రాష్ట్ర విభ‌జ‌న ముందు వ‌ర‌కు ఈ కుటుంబం కాంగ్రెస్‌లో ఉంది.అయితే.త‌ర్వాత 2014 ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌డంతోపాటు.2019 ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల వ‌ర‌కు రాజ‌కీయాల‌కు దూరంగానే కాలం గ‌డిపేసింది.ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి ఈ కుటుంబానికి రాజ‌కీయ ఆఫ‌ర్లు వ‌చ్చాయి.అయితే, వాటిని కాద‌ని భేష‌జాల‌కు పోయి టీడీపీలో చేరారు.ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకుని కేఈ కృష్ణ‌మూర్తితో ఉన్న విభేదాల‌ను కూడా ప‌క్క‌న పెట్టి మ‌రీ సైకిల్ ఎక్కారు.

Telugu Andhra Pradesh, Ap, Chandra Babu, Jagan, Kotlavijaya, War, Tdp-Political

అయితే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అనూహ్య ప‌రాజ‌యం పాల‌య్యారు.ఇక‌, అప్ప‌టి నుంచి కోట్ల కుటుంబం ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.అదే వైసీపీలోకి వ‌చ్చి ఉంటే.

ప‌రిస్తితి వేరేగా ఉండేద‌ని అంటున్న‌వారు ఉన్నారు.ఇప్పుడు టీడీపీ ప‌రిస్తితి దారుణంగా ఉంది.

పార్టీలో ఉన్న‌వారే.యాక్టివ్ రోల్ పోషిస్తున్న‌వారికే చంద్ర‌బాబు విలువ ఇవ్వ‌డం లేద‌ని అంటున్నారు.

అలాంటిది వృద్దులు, రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించే ఛాన్స్ లేని ఈ కుటుంబాన్ని ప‌ట్టించుకునే తీరిక చంద్ర‌బాబుకు లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.దీంతో ఈ కుటుంబం రాజ‌కీయాలు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు సాగేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మొత్తానికి ఒక నిర్ణ‌యం కోట్ల కుటుంబానికి ఫ్యూచ‌ర్ లేకుండా చేసింద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube