సుధీర్ బాబు ఏమైపోయాడు ?

మహేష్ బావగా ఇండస్ట్రికి పరిచయమయ్యాడు సుధీర్ బాబు.మొదటి చిత్రం ఎస్ ఎం ఎస్ ఆవరేజ్ గా నిలిచినప్పటికీ రెండో చిత్రం ప్రేమకథ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడించాడు.

 Where Is Sudheer Babu ?-TeluguStop.com

తరువాత మాస్ బాట పట్టి ” ఆడు మగడ్రా బుజ్జి” అంటూ చేతులు కాల్చుకున్నాడు.

అందం, కండలు, నటన చాతుర్యం .అన్ని ఉన్నా సుధీర్ కెరీర్ ఆశించిన స్తాయిలో సాగలేదు ఇప్పటి దాకా.కారణాలు ఏవైనా ఒక సంవత్సరం పాటు ఒక్క సినిమా కుడా విడుదల చేయలేదు సుధీర్.

స్వామిరారా కు సీక్వెల్ గా వచ్చిన మోసగాళ్ళకు మోసగాడు కుడా చెడు అనుభవాన్నే మిగిల్చింది.ఇక రేసేంట్ గా వచ్చిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఫర్వాలేదనిపించింది.

ప్రస్తుతానికి టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ నటిస్తున్న హిందీ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్న సుధీర్, నూతన దర్శకుడు శ్రీరాం తో ఓ తెలుగు సినిమా చేస్తున్నాడు.భలే మంచి రోజు అనే టైటిల్ దీనికి ఫిక్స్ చేసారు.

అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటా సుధీర్ కెరీర్ లో.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుధీర్ చేతిలో చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.ఇప్పుడే చెప్పేస్తే తొందరపాటు అవుతుంది, వచ్చే సంవత్సరం సుధీర్ తన సత్తా చాటుతాడు అని చెప్పుకొచ్చారు ఆయన సొంత మనిషి ఒకరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube