ఇంకొన్ని రోజులైతే కోన వెంకట్ కనబడుటలేదు అని నిజంగానే ప్రకటన ఇవ్వాలేమో.దూకుడు హిట్ అయినప్పటినుంచి ఈ రైటర్ ఆడిందే ఆట, పాడిందే పాట.
ఏ పెద్ద హీరో అయినా కోనవెంకట్ కావాల్సిందే అన్నాడు .కొనవెంకట్ అంటే ఒక బ్రాండ్ అనే స్థాయి నుంచి కొనవెంకట్ సినిమా అంటే భయపడే స్థాయికి పడిపోయాడు ఈ స్టార్ రైటర్.
బ్రూస్ లీ వచ్చింది పోయింది, అఖిల్ ఎందుకు తీసారో అర్థం కాకుండా పోయింది, సౌఖ్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా పోయింది .ఆఖరికి డిక్టేటర్ మీద కూడా ఫ్లాప్ ముద్ర పడిపోయింది.ఇప్పుడు కోనవెంకట్ అడ్రెస్ గల్లంతయ్యిపోయింది.సరిగ్గా కోనవెంకట్ ప్రాసలోనే చెప్పాం కదా!
మీడియాకి చిక్కడం లేదు … ఏ సినిమా కథ పేపర్ మీద ఉందో, ఏ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయో .కోన తదుపరి చిత్రం ఏదో, ఎప్పుడొస్తుందో … ఏమి అర్థం కావట్లేదు.కాస్త ఎవరికైనా కోన గారి జాడ తెలిస్తే చెప్పండి.