జగన్ ఎక్కడున్నావ్.. అంటున్న నారా లోకేష్..!!

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సూళ్లూరుపేటలో నారా లోకేష్ వైయస్ వివేకానంద హత్య కేసు విషయంలో జగన్ కి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కు సంబంధించి తనకు తన కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేయటానికి తాను రెడీ అనటం మాత్రమే కాక జగన్ కుటుంబానికి ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదు అని ప్రమాణం చేయగలరా అంటూ అప్పట్లో జగన్ కి లోకేష్ సవాల్ చేయడం తెలిసిందే.

 Where Is Jagan Nara Lokesh Questioning-TeluguStop.com

తాజాగా తాను తన కుటుంబం ఈ హత్యకు సంబంధం లేదని తెలియజేస్తూ లోకేష్ తిరుపతిలో అలిపిరి ప్రాంతం వద్ద బైఠాయించారు.

తనకి ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదు.

 Where Is Jagan Nara Lokesh Questioning-జగన్ ఎక్కడున్నావ్.. అంటున్న నారా లోకేష్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రమాణం చేయడానికి తాను వచ్చినట్లు మరి ముఖ్యమంత్రి జగన్ ఎక్కడున్నారో అలిపిరి కి వస్తారా ? ఎదురుచూస్తున్నాము అన్నట్టు మీడియా ముందు లోకేష్ వెల్లడించారు.దీంతో అలిపిరి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

నారా లోకేష్ తో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు మరియు టిడిపి నాయకులు బైఠాయించారు.ఏమాత్రం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఆయన బాబాయ్ హత్య కేసు విషయంలో వాళ్ల కుటుంబానికి సంబంధం లేదు అని భావిస్తే వెంటనే దైవ సాక్షిగా వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేయాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది అని లోకేష్ సంచలన సవాల్ విసిరారు.

 

#Nara Lokesh #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు