విజయవాడ ఎంపీ కేశినేని( Kesineni nani ) నానిపై టీడీపీ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ క్రమంలోనే కేశినేని నాని ఆస్తులు, అప్పులను బోండా ఉమ( Bonda Uma ) విడుదల చేశారు.అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటేనని విమర్శించారు.2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకున్నారన్నారు.అంతేకాకుండా కేశినేని నాని సర్వీస్ టాక్స్ కూడా ఎగ్గొట్టారని తెలిపారు.
కేశినేని నానికి రూ.2 వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నించారు.ఊరిలో వారి ఆస్తులను కూడా తన ఖాతాలో వేసుకుని చెప్తున్నారా అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు( Chandrababu naidu )ను కేశినేని నాని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు.తనపై పోటీ చేస్తే కేశినేని నానికి డిపాజిట్ కూడా రాదని తెలిపారు.