మ‌న దేశంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా జ‌రిగిందో తెలుసా?

భారతదేశంలో రైలు ప్రమాదాల్లో ఏటా వందల మంది మరణిస్తున్నారు.ఈ ప్రమాదాలకు సాంకేతిక లోపం, మానవ తప్పిదం, నిర్లక్ష్యం, అన‌నుకూల‌ వాతావరణం మొదలైనవి కార‌ణాలుగా నిలుస్తున్నాయి.

 Where And How The Biggest Train Accident In India People Died Bihar, Bihar , Train Accident , India , Died, Saharsa From Mansi, Storm-TeluguStop.com

జూన్ 6, 1981 న జరిగిన రైలు ప్రమాదం అత్యంత ఘోర‌మైన‌ది.అది భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత భయంకరమైన ప్రమాదం.ఈ ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది.6 జూన్ 1981.అది సాయంత్రం సమయం.9 కోచ్‌ల ప్యాసింజర్ రైలు ప్రయాణికులతో నిండిపోయింది.రైలు నంబర్ 416డీఎన్ మాన్సీ నుండి సహర్సా(బీహార్‌) వైపు వెళుతోంది.రైలు బద్లా ఘాట్ మరియు ఢమరా ఘాట్ స్టేషన్ మధ్య బాగ్మతి నది గుండా వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ప్రయాణికుల కేకలు వేశారు.ఆ సమయంలో వారిని రక్షించే వారే లేరు.

 Where And How The Biggest Train Accident In India People Died Bihar, Bihar , Train Accident , India , Died, Saharsa From Mansi, Storm-మ‌న దేశంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా జ‌రిగిందో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమీపంలోని ప్రజలు నది వద్దకు చేరుకునే సరికి వందలాది మంది నదిలో మునిగి చనిపోయారు.ఈ ప్రమాదం భారతదేశంలో అతిపెద్ద రైలు ప్రమాదం.

ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైలు ప్రమాదం.ఈ ఘోర రైలు ప్రమాదం తర్వాత, సెర్చ్ ఆపరేషన్ చాలా రోజుల పాటు కొనసాగింది.

ఐదు రోజుల పాటు శ్రమించి 200కు పైగా మృతదేహాలను నది నుండి బయటకు తీశారు.

నది ప్రవాహానికి పలువురి మృతదేహాలు కొట్టుకుపోయాయి.ఈ ప్రమాదంలో సుమారు 300 మంది ప్రయాణికులు మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.తుఫాను కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కొందరు, నదికి ఒక్కసారిగా వరదలు రావడంతో రైలు ప‌డిపోయింద‌ని కొందరు అంటున్నారు.

వంతెనపై ఉన్న ఆవును రక్షించడానికి లోకో పైలట్ అకస్మాత్తుగా పదునైన బ్రేక్‌లు వేశాడ‌ని.దీని కారణంగా రైలులోని చివరి 7 కోచ్‌లు బోల్తా పడి, వంతెనను చీల్చుకుని నదిలో పడిపోయాయ‌ని కూడా కొందరు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube