ఏకగ్రీవమైన సర్పంచ్ ల నిధుల విషయంలో స్పష్టత వచ్చేదెప్పుడు?

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏకగ్రీవ సర్పంచ్ లు గుర్రుగా ఉన్నారు.కేసీఆర్ ఎన్నికల సమయంలో ఏకగ్రీవమైన సర్పంచ్ లకు ఆయా గ్రామాలకు పది లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

 When Will There Be Clarity On The Funding Of Unanimous Sarpanches?-kcr, Trs , Te-TeluguStop.com

కాని ఈ హామీని ప్రభుత్వం విస్మరించడంతో ఏకగ్రీవ సర్పంచ్ లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.పది లక్షల రూపాయల నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనుకున్న సర్పంచ్ లకు నిరాశే మిగులుతూ వస్తోంది.

కొంత మంది సర్పంచులు అయితే ఏకగ్రీవ నిధులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి మరీ, తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

Telugu @cm_kcr, @trspartyonline, Telangana, Sarpanches, Sarpanches Kcr-Telugu Po

ఇప్పటికీ ఈ విషయంపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ లు కూడా ఉన్నారు.ఈ విషయంపై స్పందించాలని పలు మార్లు ఎన్నో వేదికల్లో సర్పంచ్ ల సంఘాలు కోరుతున్నప్పటికీ, ప్రభుత్వం నుండి ఎటువంటి ఆశావాహ స్పందన లేకపోవడంతో రోజు రోజుకు సర్పంచ్ లలో అసహనం పెరిగిపోతోంది.ప్రభుత్వం ఇప్పటికైనా ఏకగ్రీవ సర్పంచ్ ల నిధుల విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని సర్పంచ్ లు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube