ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ ( Honor )నుంచి బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్ హానర్ ఎక్స్9బీ 5జీ ఫోన్ ( Honor X9B 5G phone ) తో పాటు హానర్ చాయిస్ ఎక్స్5 ఇయర్ బడ్స్, హానర్ చాయిస్ వాచ్ ఫిబ్రవరి 15వ తేదీ లాంఛ్ అవ్వనుంది.ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలు ఏమిటో చూద్దాం.
హానర్ ఎక్స్9బీ 5జీ స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్-13 ఆధారిత మ్యాజిక్ OS 7.2 ఆధారంగా పనిచేస్తుంది.5800 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 18 గంటల కాలింగ్ సమయం, 12 గంటల గేమింగ్ సమయం, 19 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్ సమయాన్ని సింగిల్ చార్జ్ పై అందిస్తుంది.1000 చార్జ్ సైకిల్స్ తర్వాత కూడా దాని సామర్థ్యంలో 80 శాతం నిలుపుకుంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM+256GB స్టోరేజ్ సామర్థ్యంతో ఉంటుంది.కావాలనుకుంటే వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఆన్ బోర్డ్ మెమరీ ను 20GB వరకు పెంచుకోవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, సన్రైజ్ ఆరెంజ్ లాంటి కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.కెమెరా విషయానికి వస్తే.మాడ్యూల్ డ్యూయల్-రింగ్ డిజైన్( dual-ring design ) తో ఉంటుంది.ఈ ఫోన్ గోల్డ్ బ్యాటరీ లేబుల్ తో ఉంటుంది.
ఫిబ్రవరి 15వ తేదీ హనర్ ఎక్స్9బీ 5జీ స్మార్ట్ ఫోన్ తో పాటు హానర్ చాయిస్ ఎక్స్5 ఇయర్ బడ్స్, హానర్ చాయిస్ వాచ్ భారతదేశ అంతట లాంచ్ అవుతున్నాయి.ఇక వీటికి సంబంధించిన ధర వివరాలు కంపెనీ ఇంకా వెల్లడించలేదు.