ఇప్పట్లో కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు రావా?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు వైపే మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక సినిమాను పాన్ ఇండియా లెవెల్ విడుదల చేయాలి అని చూస్తున్నారు.

 When Will Kollywood Become Pan India Details,  Kollywood, Pan India Movies, Koll-TeluguStop.com

ఇకపోతే తెలుగు సినిమా అంటేనే పాన్ ఇండియా సినిమా అని అంటున్నారు.ఇప్పటికే తెలుగులో ప్రభాస్,రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ఇండియా హీరోలుగా ఎస్టాబ్లిష్ అయిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం మరొకసారి హీరో కూడా ఈ పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరనున్నాడు.ఆ స్టార్ హీరో మరెవరో కాదు మహేష్ బాబు.

ఇంకా చెప్పాలి అంటే దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో సినిమా చేసినా కూడా అతను పాన్ ఇండియా కేటగిరిలో చేరుతాడు అన్నది వాస్తవం.

రాజమౌళి ద్వారా ఇప్పటికే కొందరు హీరోలు పాన్ ఇండియా వైస్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మరి కొందరు దర్శకనిర్మాతలు పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.కేజీఎఫ్ సినిమా హిట్ తో కన్నడ పరిశ్రమ పేరు దేశం మొత్తం మారు మ్రోగిపోతోంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్,యశ్ లాంటి వారు మార్గం వేస్తే.ప్రస్తుతం ఆ దారిలో మరింత మంది నడవడానికి సిద్ధపడుతున్నారు.

ఇక మలయాళ హీరోలు కూడా మేమేం తక్కువ కాదు పాన్ ఇండియా వైస్ సినిమాను విడుదల చేయడానికి పోటీపడుతుండగా కోలీవుడ్ హీరోలు మాత్రం ఇంకా పాన్ ఇండియా వైపు మొగ్గు చూపడం లేదు.

Telugu Kollywood, Kollywoodpan, Mahesh Babu, Pan India, Rajamouli, Ram Charan, S

కోలీవుడ్ సినిమాలను కేవలం మల్టీ లింగ్యువల్ గా తమ సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు తప్ప.పాన్ ఇండియా కేటగిరిపై కన్నేయలేదు.అనువాద రూపంలో వచ్చిన సినిమాల్ని కూడా పెద్దగా ప్రమోట్ చేయడం లేదు.

దీనిని బట్టి చూస్తే ఇప్పట్లో కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చేలా కనిపించడం లేదు.అసలు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తాయా? రావా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube