గుటెర్రస్ పిలుపు ఫలించేది ఎన్న‌డు?

విశ్వంలో అన్ని దేశాలు అణ్వాయుధాలు కాస్తో కూస్తో కలిగి ఉన్నాయి.అణ్వాస్రాలు లేని దేశాలు అణ్వస్త్రాలు సమకూర్చు కుంటున్నాయి.

 When Will Guterres' Call Bear Fruit, António Guterres, United Nations , Secreta-TeluguStop.com

ఈ అణ్వస్త్రాలు విశ్వ కళ్యాణానికే వినియోగించాలి దేశాల పై దాడికి కారాదని ఇటీవలే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ పిలుపునిచ్చారు.ఈ పిలుపు మంచిదే కానీ ఏ దేశం పాటిస్తున్న దాఖలాలు లేవు.

భారత్ కొంత వరకు కట్టుబడిన పొరుగున ఉన్న పాక్,చైనా లతో కవ్వింపు చర్యలు ఉంటున్నాయి.భద్రత కోసం భారత్ కు అణ్వస్త్రాలు ఉండాల్సిందే.

అవసరమైతేనే భారత్ అణ్వస్త్రాలు వినియోగిస్తుంది.కాని విచక్షణ కోల్పోయి ఎప్పుడు అణ్వస్త్రాలు వినియోగించదు,దేశాలను భయ పెట్టదు.

ప్రపంచంలో భారీ అణ్వాయుధాలు ఉత్తర కొరియా కు ఉన్నా అది రహస్యం.ఏ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగితే అప్పుడు అమెరికా స్పందిస్తుంది.

ప్రస్తుతం రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా భారీ ఎత్తున ఆయుధాలు సమకూర్చిందనేది నగ్న సత్యం.అందుకే యుద్ధం ఆగలేదు.

రష్యాకు ఉక్రెయిన్ సత్తా ఏమిటో తెలిసొచ్చింది.ఇక్కడ రష్యా పంతానికి పోయి ఇరుకున పడింది.

స్వదేశంలో నే చాలా మంది పౌరులు పుతిన్ నిర్ణయం పట్ల అనుకూలంగా లేరు,పైగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.అటు ఉక్రెయిన్ తోను పుతిన్ అపప్రధా మూట గట్టుకున్నారు.

యుద్ధం ఇంకా కొనసాగుతుంది అంటే అది అమెరికా చలువనే.

రష్యా అణ్వాయుధాలు ఏవి పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.

ఫలితం కూడా రావడం లేదు అందుకని అణు బాంబు ప్రయోగిస్తామని సంకేతం ఇచ్చింది.ఇక గుటెర్రస్ పిలుపుకు ఏం విలువ ఉంటుంది.

ప్రస్తుతం అణ్వాయుధాలు , అణు బాంబులు ఏ దేశానికి శ్రేయస్కరం కాదు.దేశాలన్నీ నిరాయుధికరణ లక్ష్యంగా ముందుకు రావాలి.

గుటెర్రస్ ఇచ్చిన పిలుపు సమంజసమే అయితే ఆయన మాటలు ఏ దేశం గౌరవిస్తోంది,ఏ దేశం పరిగణలోకి తీసుకుంటోంది చెప్పాలి.అణు నిరాయుధీకరణ వైపుగా అన్ని దేశాలు పయనించాలని, విశ్వ శాంతి పరిరక్షణ అన్ని దేశాల ఏకైక లక్ష్యం కావాలని ఆయన పిలుపు సమర్ధనీయమే.

అయితే ఏ దేశాలు అణు నిరాయుధీకరణకు సుముఖంగా లేవు.ఇక ప్రపంచ శాంతి ఎక్కడ? ముస్సోలిని చెప్పినట్లు ప్రపంచ శాంతి పిరికి వాని కల అన్న మాట అక్షరాల నిజం.దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని జనరల్ అసెంబ్లీ సమావేశం లో గుటెర్రస్ విజ్ఞప్తి చేశారు.

Telugu America, Antonio, India, Modi, Korea, Russia, Ukraine-Political

ప్రపంచంలో అణు ముప్పు తొలగాలని ఆయన వాంఛించారు.అయితే ఇప్పుడు జరుగుతున్న రష్యా,ఉక్రెయిన్ యుద్ధం లో ఎవరు ముందు ఇక యుద్ధం చేయం అని ప్రకటిస్తారో, లేక సయోధ్య వైపు అడుగు వేస్తారో తెలియని పరిస్థితి.అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసేంత వరకు యుద్ధం ఆగదు.

ఏతావాతా రష్యానే ఓ అడుగు ముందుకేసి ఇక ఉక్రెయిన్ పై దాడులు ఉండవు అని ప్రకటించే స్థితిలో ఉండాలి.కాని రష్యా అది తనకు,తన దేశానికి చిన్న చూపు అని దాంతో రష్యా, భద్రత వెలుగులోకి వస్తుందని చిన్న దేశాన్ని రష్యా ఇంకా తన అదుపులోకి తీసుకోలేక పోతోంది అనే విమర్శలు చెలరేగుతాయి.

అందుకే రష్యా యుద్ధాన్ని నివారించ లేక పోతోంది.అమెరికా ,ఉక్రెయిన్ కు ఆయుధాలు అందిస్తూనే ఉంది.మరి ఇక్కడ ఏ దేశం తగ్గాలి అని ప్రశ్నించుకుంటే రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం లో చర్చలు జరగాలి.మధ్యవర్తులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ,ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ గుటెర్రస్ ముందుకు రావాలి.

లేకపోతే యుద్ధం దీర్గకాలంగా కొనసాగుతూనే ఉంటుంది.క్రమేణా పౌరులలో విసుగు వచ్చి దేశాలను వదిలి పెట్టె పరిస్థితి వస్తుంది.

Telugu America, Antonio, India, Modi, Korea, Russia, Ukraine-Political

ఇప్పటికే చాలా మంది రష్యాను విడిచిపెట్టారు అని భోగట్టా.అణ్వాయుధాలు నిర్ములించకుండా శాంతి , విశ్వాసం, స్థిరమైన మానవాళి భవిష్యత్తు ఉండదు.అణు ముప్పు తొలగించటానికి మార్గాలు ఉపయోగించాలని దేశాలను కోరారు.నిరాయుధీకరణ వలన యుద్ధ ప్రేరణ తగ్గుతుంది.దేశాలు శాంతిగా ఉండాలి అంటే అణు పరీక్షలు ఏ దేశాలు చేయకూడదు అనేది గుటెర్రస్ పిలుపు.అయితే అణ్వాయుధాలు కేవలం భద్రత కోసమే ఉంచుకున్నామని వాటిని ఉపయోగించమని దేశాలు తేటతెల్లం చేయాలి.

ఈ విషయంలో ఉత్తర కొరియా గుటెర్రస్ పిలుపు పెడచెవిన పెట్టి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష, అణు పరీక్ష జరిపింది.దాంతో దక్షిణ కొరియా కలవర పాటుకు గురయింది.

వెంటనే అది అమెరికా తో రహస్యంగా మంతనాలు చేయడం, దక్షిణ కొరియాకు మా మద్దతు ఉంటుందని అగ్రరాజ్యం ప్రకటించడం తెలిసిందే.శాంతిని కోరుకునే దేశాలు స్వచ్చందంగా ఏ దేశంపై దాడి చేయం.

పరస్పర సహకారం, చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటాయనే దొరణితో ఉండాలి.అప్పుడే అణ్వాయుధాలు ,అణు యుద్ధాలు ఆగిపొగలవు.

దేశాలు ఐక్యంగా ఉండి, సహాయ సహకారాలు ఇచ్చి పుచ్చు కోవాలి.అపుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది.

ఐక్యరాజ్య సమితి ఆశయం కూడా నెరవేరుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube